TELUGU JOKES 3

948 . నాకామధ్య ఆపరేషను అయ్యిందని మీకు తెలియదనుకుంటా?'' అన్నాడు హరి.
'' తెలిసింది లెండి. ఈ మధ్యనే వెటర్నటి డాక్టరుగారు చెప్పారు!'' అన్నాడు గిరి.


 డాక్టర్‌ కైలాసం కారులో వెళ్తూ తన పేషెంట్‌ని చూడ్డానికి ఓ యింటి ముందు ఆగి పేషెంట్‌ డాక్టర్ని చూసి '' మీ మందులు, మీ వైద్యం మంచిదికాదు. మీరిచ్చినవన్నీ పరమ చెత్త మందులని మరో డాక్టర్‌ చెప్పాడు. అందుకే అవి వాడుతున్నాను...'' అన్నాడు
డాక్టర్‌ తిరిగి వెళ్ళిపోతూ అన్నాడు '' కొద్ది రోజులు ఆగితే నావి చెత్తమందులో ఆ డాక్టర్‌వి చెత్త మందులో పోస్ట్‌మార్టమ్‌లో తెలుస్తుందిలే...''

ఎందుకేడుస్తున్నరండి పార్కులో చెట్టుకింద కూర్చుని ఏడుస్తున్న కుమార్‌ను పలకరించాడు రమేష్‌
నేను మా ఆవిడను చంపాలనుకున్నాను వద్దని అందుకు 14 ఏళ్ళ కారాగారశిక్ష పడుతుందని నా లాయర్‌ ఫ్రెండ్‌ హెచ్చరించడం వల్ల చంపలేదు ఆలోచించు 14 ఏళ్ళ క్రితం నేనా పని చేసుంటే ఇవాల్టికి విడుదలయి స్వతంత్రుడ్ని అయ్యేవాడిని ఆవిడింకా బ్రతికేవుంది అని మళ్ళా ఏడవసాగాడు కుమార్‌

ఎందుకురా ఎప్పుడు చూచినా బాధ పడతావు?'' అడిగాడు అజయ్‌.
'' ఏం చెప్పమంటావు నా పేరుని మరొకరికి పెట్టారుగా....'' మరింతగా బాధపడ్డాడు విజయ్‌.

'' డాక్టర్‌..! నాకు కడుపు నోప్పి తగ్గలేదు. పైగా ఎక్కువైపోయింది..''
'' మిమ్మల్ని సంవత్సరం పిల్లాడు తినే తిండి తినమన్నానుగా..''
'' అలాగే తిన్నానండీ..''
'' ఏం తిన్నారు..?'
'' చాక్‌లెట్లు, బిస్కట్లు, వేరు సెనక్కాయలు, అరటి తొక్కలు, బఠాణీలు, మట్టి పెల్లలు..''

భార్య శవంతో కుక్కను వెంటబెట్టుకుని వెళుతున్నాడు నారాయణ వాడి వెనకాల క్యూలో వందమంది దాకా స్మశానానికి వెళుతున్నారు
ఆ కుక్క కడా దేనికి అడిగాడు గోవింది
ఇది మా ఆవిడను చంపేసింది కాబట్టి -చెప్పాడు నారాయణ


ఎనభై ఏళ్ళ ముసలివాడు ఓ డాక్టర్‌ దగ్గరకెళ్ళాడు.
'' డాక్టర్‌! నేను ఈ మధ్య ఓ పదహారేళ్ళ అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాను. అంతే కాదు తండ్రిని కూడా కాబోతున్నాను. దీని పై మీ అభిప్రాయం..?'' అనడిగాడు.
'' నేనో కథ చెప్తాను వినండి. నేనొకసారి అడవికి వెళ్ళాను. కాస్త దూరం వెళ్ళేసరికి గాండ్రిస్తూ ఓ పులి వచ్చింది. నా చేతిలో ఓ గొడుగు మాత్రం ఉంది. అంతే..! వెంటనే నేను గురి చూసి పులిమీదకు గొడుగును విసిరాను పులి చచ్చిపోయింది..'' అన్నాడు డాక్టర్‌.
'' అబద్ధం. మీరు గొడుగు విసిరే సమయానికి చాటునుండి ఎవరో తుపాకీ గురిపెట్టి పులిని చంపేసి ఉంటారంటాను నేను..'' అన్నాడు ముసలివాడు.
'' మీ విషయంలోనూ అదే అంటాను..'' అన్నాడు డాక్టర్‌.

మా అమ్మగారి వందన పుట్టినరోజు సందర్భంగా మా కుటుంబసభ్యులందరు వందమందిని స్టార్‌ హోటల్‌కి వెళ్ళాము. అక్కడ ఎలా కూర్చోవాలో తెలియక అవస్థపడుతుంటే, అక్కడుండే వెయిటర్‌, మా అమ్మగారిని '' మీరు ఇందులో ఒక్కరా?'' అని అడిగాడు.
'' ఒక్కర్తిని కాదు. ఇంతమందిని ఉత్పత్తి చేయడానికి కారకురాలిని నేను'' నవ్వుతూ జవాబిచ్చాడు ఆవిడ.


దేవదాసు బాగా త్రాగేసి ఇంటికొచ్చాడు. అర్థరాత్రి కావడంతో భార్యకు అనుమానం రాకుండా, వాసన తెలియకుండా ఓ అద్దం ముందు నిలబడి నోటికి ప్లాస్టర్‌ అతికించి వెళ్ళి పడుకున్నాడు. పొద్దున్నే భార్య వచ్చి '' మీరు రాత్రి బాగా త్రాగొచ్చారా..? '' అనడిగింది.
'' అబ్బే.. నేనసలు త్రాగలేదు..'' అన్నాడు దేవదాసు.'' మరి ఈ ప్లాస్టరు ఎవరు అతికించారు..?'' కోపంగా అడిగింది అద్దానికి అతికించి ఉన్న ప్లాస్టర్‌ చూపిస్తూ.

కాకినాడలో వుండగా మా అమ్మగారి విషయంలో ఓ హాస్య సంఘటన జరిగింది అంది లక్ష్మి
కాని నువ్వు రాజమండ్రిలో పుట్టినట్టున్నావుకదా అనుమానంగా అడిగింది కమల.


కాకినాడ రైల్వే స్టేషన్లో రైలు కదలడానికి సిద్దంగా ఉంది. రైల్లో కూర్చొని బయటకు చూస్తున్నాడు బాబూరావ్‌. ఉన్నట్టుండి అతని కళ్లు కాస్త దూరంగా నిలబడి తనవైపు చూస్తూ , ఏదో చెబుతున్న ఓ వ్యక్తి మీద పడ్డాయి. కాని అతనేం చెప్తున్నాడో బాబూరావుకి సరిగ్గా వినపడ్డంలేదు. పోనీ దగ్గరికెళ్ళి అడుగుదామంటే రైలు కదలిపోతుందేమో అనిపించింది. అతను మాత్రం ఇంకా ఏదో చెబుతున్నాట్లే ఉన్నాడు. బాబూరావు టెన్షన్‌ భరించలేక రైలుదిగి అతని దగ్గరికెళ్ళి '' సార్‌! ఇందాకట్నుండి మీరు ఏదో మాట్లాడుతున్నారు. కాని ఎనౌన్స్‌మెంట్లు, ట్రెయిన్ల హోరు, జనాల హడావిడిలో నాకు విన్పించడం లేదు. ఇంతకూ మీరు మాట్లాడేదేమిటి..?'' చిరాగ్గా అన్నాడు
వెంటనే అతడు చిరాగ్గా '' నేనసలు ఏమీ మాట్లాడలేదయ్యా..! వక్కపొడి నముల్తున్నా..అంతే'' అన్నాడు.

తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కకపోవడంతో బాధపడుతున్న తన మిత్రుడు రమేష్‌ తో అన్నాడు కుమార్‌ '' ఎందుకు వర్రీ? అమ్మాయిలు సిటీబస్సులు వంటివారు, ఒకరి తరువాత మరొకరు ఎక్కుతునే ఉంటారు''
'' కానీ ఆ అమ్మాయి నా దగ్గర వెయ్యి రూపాయలు అప్పు తీసుకుని తీర్చలేదు'' అన్నాడు రమేష్‌ బాధగా.

నువ్వు నన్ను ఇంతకు ముందెప్పుడయిన చూసావా అడిగాడు జడ్జి ముద్దాయిని
ఏమోనండి నేను ఎంతోమంది దగ్గర అప్పులు చేస్తుంటాను అందరి మొహాలు గుర్తు పెట్టుకోవాలంటే కష్టం అన్నాడు ముద్దాయి

 '' నాన్నగారు నేను డాక్టరునయ్యాను. నాకేదైనా సలహా ఇవ్వండి!'' కొడుకు అన్నాడు డాక్టరైనా తండ్రితో.
'' తప్పకుండా రెండు విషయాలు గుర్తుంచుకో. ప్రిస్కిప్షన్‌ అర్థం కాకుండా రాయి. బిల్లు మాత్రం అర్థమయ్యెలా వ్రాయి!'' అన్నాడు తండ్రి.

భార్య వడ్డించిన అన్నం తింటూ అన్నాడు భర్త.
'' ఛ... ఈ వంట అసలు బాగోలేదు. మా అమ్మ చేసే వంటలాగ రుచిగా లేదు..'' అని.
'' మీ జీతం మా నాన్న జీతం లాగ ఐదువేలు లేదు. మరి నేను దెప్పిపొడిచానా..?'' కోపంగా అంది భార్య.


ఒక లాయరు జైలులో వున్న ఖైదీని చూసి యింటికొచ్చాడు.
నాన్న నువ్వా కేసుని వాదించబోతున్నావా అడిగాడు కొడుకు
లేదురా అతను దొంగతనం చెయ్యలేదని నేను గట్టిగా నమ్ముతున్నాను అన్నాడు లాయరు తండ్రి.

చంటిపిల్లాణ్ణి బాగా ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి పక్కింటావిడతో కబుర్లు చెబుతూ కూర్చుంది కృష్ణావేణి. పిల్లాడు లేచి ఏడుపు మొదలు పెట్టినా ఆవిడనసలు విన్పించుకోలేదు. అంతలో ఆఫీసు నుండి వచ్చిన భర్త కోపంగా '' నీకసలు బుద్దుందా? పిల్లాడు లేచి ఏడుస్తున్నా చూడ్డంలేదు. పైగా అసలు వాణ్ణి అంత ఎత్తుగా ఉన్న మంచం మీద ఎందుకు పడుకోబెట్టావు..?'' అన్నాడు.
'' ఏముందీ. అంత ఎత్తుమీద నుండి కిందపడితే శబ్దం బయటకు వినిపిస్తుందని...'' రుసరుసలాడుతూ చెప్పింది కృష్ణవేణి.

 '' వచ్చే ఆదివారం మనం భార్యలను మార్చుకుందాం!'' అన్నాడు మురళి.
'' అలాగే కుమార్‌ భార్యను నీకు అప్పగిస్తాను!'' అన్నాడు సురేష్‌.
'' గుడ్‌ బదులుగా రమేష్‌ భార్యను నీకు అప్పగిస్తాను!'' అన్నాడు మురళి.

 '' ఏవండీ..! ఈ రోజు మన పెళ్ళిరోజు కదా. సరదాగా బయటకెళ్ళి తిరిగొద్దామండీ...!'' అంది భార్య.
'' అలాగే తిరిగొద్దాం.కానిక తాళం చేతులు పక్కింటి వాళ్ళుకు ఇచ్చి వెళ్దాం. ఎందుకంటే మనిద్దరిలో ఎవరం ముందొచ్చినా వెయిట్‌ చేయనవసరం లేదు...'' అన్నాడు భర్త.


ఓ అవ్వతో హాస్యలాడాడు ఓ కుర్రవాడు నీకు జంతికలు కావాలా? అరిసెలు కావాలా? మగాడు కావాలా?
జంతికలు అతిసెలు తినడానికి నాకు పళ్ళులేవు బాబు సిగ్గుపడుతూ అంది అవ్వ.

 '' సార్‌..! నాకు ఒక గంట పర్మిషన్‌ ఇస్తే ఇంటికెళ్ళోస్తాన్‌..'' అన్నాడు శ్రీహరి.
'' ఎందుకోయ్‌. పొద్దున్నే మీ ఆవిడను పుట్టింటికి బస్సెక్కించి వచ్చానన్నావు. ఇక నీకు ఇంటి దగ్గర పనేముంటుంది..?'' అన్నాడు మేనేజరు.
'' మా యిద్దరికీ పెళ్లయ్యాక మొట్టమొదటిసారిగా మా భార్య పుట్టింటికి వెళ్ళింది. నా భార్యలేని ఇల్లు ఎంత హాయిగా, ప్రశాంతంగా ఉందో చూడాలని ఉంది సార్‌..!'' అన్నాడు శ్రీహరి ఆత్రంగా.

 '' అవునొదినా! ఆ..... బిందు వాళ్ళింట్లో ఏ పనిమనిషి పట్టుమని రెండురోజులు పని చేయకుండా మానేస్తుందెందుకు?'' అడిగింది లక్ష్మి.
'' ఆ.... వాళ్ళాయన అస్సలు చనువే తీసుకోడట!'' చెప్పింది కమల.

 నా సాంబారులో పురుగుంది
గట్టిగా అరవకండి సార్‌ లేకపోతే మిగతా కష్టమర్స్‌ కూడా కావాలంటారు అన్నాడు వెయిటర్‌

 '' ప్రపంచ నాయకులంతా సమావేశమయి వారి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఇకమీదట యుద్దాలు జరగకుండా శాంతిని నెలకొల్పాలని యోచిస్తున్నాయి!'' రమేష్‌తో అన్నాడు కుమార్‌.
'' దానికి అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌ అడ్డుపడతాయి!''
''ఏం?''
'' వాళ్ళ ఆయుధ వ్యాపారం దెబ్బతింటుందిగా!''

 '' చాలా కాలం తర్వాత కలసిన మిత్రుడు మధుతో అన్నాడు దాసు. '' ఓరేయ్‌! మధూ! మనం కాలేజీలో చదివేటప్పుడు నన్ను అవమానపరిచి ఆడరౌడీల ప్రవర్తించిన రాణిని చాలా దారుణంగా రేప్‌ చేశానురా..!''
'' నిజమా..! మరి నీకు చట్టం శిక్ష విధించలేదా?
'' నూరేళ్ళు విదించింది..''
'' నూరేళ్ళా..! మనం చట్టంలో ఏనేరానికి ఇన్నేళ్ళు శిక్షలేదే..!
'' అదేరా.. రాణితో నా పెళ్ళి జరిపించారు...''

 ఏంటీ విచారంగా వున్నావు
నీ భార్య గురించి...
నా భార్య గురించా? ఆమెకేమయ్యింది? ఆశ్చర్యంగా అడిగాడు రమేష్‌
నీకు తెలియదేమో కాని ఆమె మీ పక్కింటాయనతో తిరిగి మనిద్ధనికి ద్రోహం చేస్తుంది మరింత విచారంగా చెప్పాడు కుమార్‌

 '' దేవుడిని ఏమని కోరుకుందాం భవాని?'' అడిగాడు ఆనంద్‌.
'' మనమిద్దరం గుడికి వచ్చినట్టుగా పూజారి నా భర్తకి చెప్పకూడదని కోరుకుందాం....'' చెప్పి నాలిక కరుచుకుంది.

 ఇది చాల ఖరీదయిన తుపాకి సార్‌ కాకతీయుల కాలంనాటిది అన్నాడు సేల్స్‌మాన్‌
కాని కాకతీయుల కాలంలో అసలు తుపాకేలేదు కదోయ్‌ అనుమానంగా అడిగాడు శేషు
అవును సార్‌ అందుకే యిది అరుదయిన తుపాకి అనేది అన్నాడు సేల్స్‌మాన్‌


'' మూడు గంటలసేపు ధారాళంగా ఉపన్నసించిన ఓ రాజకీయనాయకుడు ' క్షమించాలి. చాలా ఎక్కువసేపు మాట్లాడినట్టున్నాను. ఎందుకంటే నా చేతికి వాచీ లేదు..' అన్నాడు.
'' చేతికి వాచీలేకపోయిన వెనుక కాలెండర్‌ ఉందిగా..!'' అన్నాడు అప్పటికే విసిగిపోయిన ఓ వ్యక్తి.

 '' నీకు పెళ్ళి చేద్దామనుకుంటున్నాను'' వంశీతో అన్నాడు ఆచారిగారు.
'' నాకు ఓ భార్యుంటే బావుండును అని ఈ మధ్యనే చాలాసార్లు అనుకున్నాను నాన్న ఎందుకో తెలుసా? పెళ్ళాలు ఎలాగూ తమతోపాటు కుట్టుమిషన్‌ తెస్తారు దానికి ఆయిల్‌ అవసరంగా. అది తెస్తారు. మా ఆఫీసు తలుపు తెరిచినప్పుడల్లా కిర్రుమంటున్న చప్పుడు వస్తుంది. నా పెళ్ళాం వుంటే ఆయిల్‌ని ఆ తలుపులో వేసి ఆ శబ్దాన్ని తగ్గించేవాడినికదా. అని ఎన్నిసార్లో అనుకున్నాను'' అన్నాడు వంశీ.

 మా ఎమ్మేల్యే ఒక కొత్తరకం దీక్ష చేబట్టబోతున్నారు
ఎలాంటిదేమిటి?
తన డిమాండ్లను వారంరోజులలోపల నెరవేర్చకపోతే ఒక రోజులో వందల కొలది యిడ్లిలు, వడలు అట్లను తిని ప్రాణత్యాగం చేస్తాడట.

 ''మీ పేరేమిటి డాక్టర్‌?'' అడిగాడు రమేష్‌.
'' యోగేష్‌!''
'' మరి పెద్ద పేరుండంటారేమిటి?'' కోప్పడ్డాడు రమేష్‌.

 బస్‌ కండక్టర్ని చేసుకున్నా మన హైమా తెగ అదృష్టవంతురాలే అంది పావని
అదెలా అడిగింది సుధ
ఏముంది సినిమాకెళ్ళాలన్నా...షికారుకు వెళ్లాలన్నా భర్తను అడగ్గానే రైట్‌రైట్‌ అనేస్తాడట చెప్పింది పావని.

 '' ఈ బెడ్‌ గ్యారంటీ వుందా?'' కొత్తగా మంచాన్ని కొనబోతూ '' అడిగాడు వంశీ.
'' ఓ.... దీనిమీద యిద్దరు పిల్లలు గ్యారంటీ!'' అన్నాడు సేల్స్‌మాన్‌.

 డాక్టరుగారు ఎవరైనా చచ్చిపోతే మీరేలా నిర్ణయిస్తారు అడిగాడు వంశీ
మగవాడు చచ్చిపోవడానికి గుండె ఆగిపోవడమే నిదర్శనం మరి ఆడదైతే.
నోరు మూసుకుపోవడం... చెప్పాడు డాక్టర్‌.

 '' పెరట్లో దానిమ్మ చెట్టుని వేశానోయ్‌!''
'' గింజలు ఉన్నదా? గింజలు లేనిదా?''
'' ఏమో! పక్కింటివాళ్ళ నడిగితే తెలుస్తుంది. మేమెప్పుడైనా తింటేగా.''

 నా పాఠకులు రెట్టింపయ్యారు అన్నాడో రచయిత
నువ్వు పెళ్ళి చేసుకుని పిల్లలను కన్నట్లు నాకు తెలినే తెలిదే నొచ్చుకొన్నాడు మరో రచయిత.

 '' నా మొహం బావుండదు కదా, జీవితాంతం ఈ మొహం చూస్తూ ఎలా గడపటం అని బాధపడుతున్నారా?'' శ్రీనివాస్‌ని అడిగింది కమల.
'' నెలకి మూడు వారాలు క్యాంప్‌లో ఉంటానని సంతోషపడుతున్నాను...'' అన్నాడు శ్రీనివాస్‌.

 స్వప్న బస్‌లోని జనాల్ని చూసి తన బస్‌ను ఎక్కలేనని నిశ్చయించుకుని తన స్కర్టు యొక్క జిప్‌ను కిందకి అయినా ఇంకా బసత్తుగా వేండడంలో మరోసారి లాగింది అయినా కూడా ఆమె బస్‌ ఎక్కలేకపోయినది వెంటనే ఆమె వెనకాల నిల్చున్న గోపాల్‌ ఆమెనా పట్టుకుని బస్‌ ఎక్కించాడు.
నన్ను పట్టుకుని బస్సు ఏక్కించడానికి నీ కెన్ని గుండెలు కోపంగా అరిచింది స్వప్న
గుండెలెందుకు నా జిప్‌ను మీరు రెండుసార్లు లాగగాలేనిది...అన్నాడు గోపాల్‌

 '' దేవికా..! నిన్ను సినిమా థియేటర్లో ఒకబ్బాయితో కలసి పళ్ళికిలిస్తూ ఒకరినొకరు రాసుకుంటూ పక్కింటి పిన్నిగారి కంట్లో పడ్డావట. ఇంతకు ఎవరా అబ్బాయి..?'' నిలదీసింది తల్లి.
'' నూన్‌షోలోనా..? ఫస్ట్‌షోలోనా మమ్మీ..?'' అడిగింది కూతురు.

 '' రోజూ గాలం పట్టుకుని తిరుగుతున్నావేమోయ్‌?''
'' అమ్మాయిలకు వేద్దామని....''

ఒక భారీకాయుడు ఒక షాపుకెళ్ళి ''నాకొక దోమ తెర చూపించవోయ్‌..!'' అన్నాడు.
'' ఇది చూడండి సార్‌! ఈ దొమతెరలో ఒక్క దోమకూడా దూరే సందులేదు.. చాలా స్పెషల్‌ క్వాలిటీ సార్‌..!' అన్నాడు షాపులోని సేల్స్‌మాన్‌.
'' చాల్చాల్లేవయ్యా! ఇక వూరుకో. చిన్న దోమ కూడా దూరే అవకాశం లేని ఈ దోమతెరలో ఇంత భారీకాయుణ్ణి నేనెలా దూరగలను?'' అంటూ వెళ్లిపోయాడా భారీకాయుడు.


 ఒంటికన్ను రెండు ముక్కులున్న వాడిని క్యాషియర్‌ గా ఎందుకు పెట్టుకున్నావోయి అడిగాడు శేఖర్‌
అతనొకవేళ డబ్బుదొంగిలించి పారిపోయిన ఈజీగా పట్టుకోవచ్చునని చెప్పాడు మేనేజరు.

కమలకు కొత్తగా పెళ్ళయింది. కూతుర్ని చూడ్డానికి వచ్చిన తల్లి '' అమ్మా! కమలా అల్లుడుగారూ నిన్ను ఎలా చూసుకుంటున్నారే?'' అంది.
'' చాలా బాగా చూసుకుంటున్నారమ్మా! నిదట్లో కూడా నన్నేతల్చుకుంటున్నారు. కానీ...'' అంటూ ఆపి పడీ పడీ నవ్వసాగింది.
'' ఎందుకు అలా నవ్వుతున్నావ్‌?''
'' ఏందలేదమ్మా...! ఆయనకు నా పేరు సరిగా గుర్తుండక నిద్దట్లో రమ ముద్దుపెట్టు, కళ్యానీ కౌగిలించుకో అంటూ రకరకాల పేర్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

 '' మీరి హోటల్‌కి మొదటిసారిగా వచ్చారు కదా?'' అడిగాడు సర్వర్‌.
'' అవును కాని ఆ విషయం నువ్వెలా కనిపెట్టావోయ్‌?'' ఆశ్చర్యంగా అడిగాడు వంశీ.
'' ఎందుకంటే ఒక్కసారి యీ హోటల్‌లో తిన్నవారు చచ్చినా మరోసారి ఈ హోటల్‌కి రారు కనుక...'' అసలు విషయం చెప్పి నాలిక్కరుచుకున్నాడు సర్వర్‌.

 సోషల్‌ మాస్టారు ఆనంద్‌ని అడిగారు.
'' ఆనంద్‌! రేడియో కన్నా దినపత్రికలే ఎప్పుడూ గొప్పని అంటారు ఎలా?''
'' అగ్గిపుల్లగీసి అంటిస్తే పేపరు వెంటనే అంటుకుంటుంది. రేడియో త్వరగా అంటుకుపోదు. పైగా కాస్త పెట్రోలు కూడా అవసరముంటుంది.


ఇవాళ నువ్వెంతో అందంగా కనిపిస్తున్నావు డార్లింగ్‌! అన్నాడు మధు
మెటిమలు పోవడానికి ప్రకృతివైద్యుడు చెప్పినట్లుగా మొహానికి బంకమట్టి రాసుకుంటే అందంగా వున్నానని అంటారా గయిమంది జ్యోతి

 '' ఈ దోసెలు బాగా మాడిపోయాయి అమ్మగారూ పారేయమంటారా?''
'' ఎందుకు పారేయడం? మీ అయ్యగారింకా టిఫిన్‌ చేయ్యలేదుగా ఉంచు..!''

 '' ఈ డాక్టరుగారు ప్రతివారం టి.వి.లో కనబడతారు!'' గొప్పగా అన్నాడు హరి.
'' ఈ మధ్య పందులు, గేదెలు కూడా టి.వి.లో కనబడుతున్నాయి. అదేం గొప్ప?'' అన్నాడు గిరి.

 నువ్వు మా ఆవిడ విడిపోయారటగా అడిగాడు రమేషు
అవును
మరి విషయం మీ ఆవిడకు చెప్పావా
లేదు!
ఎందుకని
చెపితే యింటికొచ్చేస్తుందని నసిగాడు కుమార్‌

 '' మీకు మీ అమ్మ కావాలో, నేను కావాలో ఈ రోజే తేల్చి చెప్పండి!'' కోపంగా అంది భవాని.
'' నాకు మీ ఇద్దరు వద్దు - పక్కింటావిడ కావాలి!'' ఠక్కున అన్నాడు ఆనంద్‌.

 మళ్లీ జన్మలో కూడా మనం భార్యాభర్తలుగానే పుట్టాలండి అంది లక్ష్మి
దానికేంగాని మరప్పుడైన నామాటవింటావా ఆశగా అడిగాడు ఆచారి.

 '' ఈ సినిమా నిర్మాత యెవరో కాని చాలా లాభం సంపాదించాడు!''
'' ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు!''
'' ఎందువల్ల?''
'' పన్నులు కట్టలేక...''

 విమానం ఆకాశంలో ఎగురుతోంది. ఇద్దరు పిల్లలు లోపల ఆడుకుంటున్నారు. ఎయిర్‌ హోస్టెస్‌ ఎంత చెప్పినా వాళ్ళు ఆట ఆపలేదు.
'' ఏయ్‌ ! పిల్లలు ఇది విమానం. ఇందులో ఆడకూడదు. కావాలంటే బయటికి పోయి ఆడుకోండి...'' అంది కోపంగా.


 అమ్మా ఆయుధం అంటే ఏమిటి అడిగాడు కొడుకు
మనం కొట్టడానికి కావల్సిన వస్తువు అంది తల్లి
అంటే నాన్నవంటిదా అడిగాడు పుత్రరత్నం

 '' వదినగారు! కాస్త అన్నయ్యగారిని పిలుస్తారా? ఫీజులుపోయాయి వేస్తారేమో కనుక్కుంటారా?'' అడిగింది లక్ష్మి.
'' అయ్యో! నా కర్మ కాలిపోను. నాకంత అదృష్టం కూడానా? ఆయన వంట చేయడం, అంట్లు తోమడం నేర్పించేసరికే నా తల ప్రాణం తోకకి వచ్చింది. ఇంకా యిది యెక్కడ నేర్పి చచ్చేది?'' బాధగా అంది కమల.

 '' నా భార్య జ్ఞాపకశక్తితో మేమందరం ఛస్తున్నామనుకోండి..'' అప్పారావు అన్నాడు సుబ్బారావుతో.
'' ఏమన్నా మర్చిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? జ్ఞాపకశక్తి పెరగడానికి ఏదైనా మందుకావాలా?'' అడిగాడు సుబ్బారావు.
'' అబ్బే! జ్ఞాపకానికి మందు అవసరం లేదండీ. మతిమరుపుకి కావాలి ప్రతి విషయం గుర్తుంచుకోని నాతో తగువుకి తిగుతోంది. అది అసలు సమస్య'' అంటూ వాపోయాడు అప్పారావు.

 సినిమా చూస్తున్నంతసేపు కడుపుబ్బి చచ్చిపోయాననుకోండి
అంత కామెడి లేదే కడుపుబ్బా నవ్వడానికి అనుమానంగా అడిగాడు రమేషు
మేనేజరు తెలివయినవాడు బాత్‌రూంలన్నీ లాకు చేయించాడు ఇంక కడుపుబ్బక ఏమవుతుంది అన్నాడు కుమార్‌.

ఈ సీసాలోని మందు ఒక చెంచాడు తీసుకొని అందులో నాలుగు చెంచాలు నీళ్లు కలుపుకొని త్రాగు..''
'' కానీ డాక్టర్‌! మాయింట్లో ఒక చెంచా మాత్రమే ఉంది...''

 '' ఈ రోజు ఎలాగో వున్నావేమిట్రా?'' కొడుకుని అడిగింది తల్లి.
'' ఏమిలేదు మమ్మి. పొద్దున్న లెట్రిన్‌కివెళ్ళి వచ్చినప్పటినుండి యేదోపోగొట్టుకున్నట్టుగా వుంది!'' చెప్పాడు కొడుకు.

 ఒక స్వామీజీ ఒకసారి కాట్రేనికోన అనే గ్రామం వెళ్ళాడు. అక్కడ నాలుగురోజులుండి దుష్టులలో పరివర్తన తీసుకురావాలనుకున్నాడు. ఒకరోజు ఆయన రోడ్డుమీద నడుస్తుంటే ఒక వ్యక్తి గుప్పుగుప్పుమని సిగరేట్‌ కాల్చడం చూసి అతిని వద్దకు వెళ్ళి '' చూడు నాయనా! ధూమపానం మహాపాపం! రేపు నీవు చనిపోయాక స్వర్గానికి వెళ్ళావనుకో..! అప్పుడు నీ
ఉపిరి నుండి ఏ మాత్రం సిగరెట్‌ వాసన వచ్చినా నిన్ను వెంటనే దేవదూతలు నరకంలోకి నెట్టేస్తారు...'' అన్నాడు.
'' భలేవారు స్వామీ..! ఆ ఊపిరి ఇక్కడ ఆగిపోయాకే కదా మనం స్వర్గానికైనా నరకానికైనా వెళ్ళేది...'' వెంటనే సమాధానం చెప్పాడావ్యక్తి.

 నా రచనలు తీసుకుని ఎంతోమంది యిల్లులు కట్టుకున్నారు.
ఎవరు పబ్లిషర్లా
కాదు చిత్తుకాగితాల వాళ్ళు

 ''రామూ! కుక్కజాతికి చెందిన నాలుగు జంతువుల పేర్లు చెప్పు..''
'' తల్లికుక్క, తండ్రికుక్క, పెద్ద పిల్ల కుక్క, చిన్న పిల్ల కుక్క ...''

 '' ఏమయ్యా! నీకు బుద్దుందటయా? భోజనం చేసి స్పూన్‌లు కూడా పట్టుకెళుతున్నావు. మరి దొంగవలె ఉన్నావే?'' అరిచాడు మేనేజరు.
'' దొంగను కాద్సార్‌. మా ఫామిలి డాక్టర్‌గారి ఆజ్ఞను పాటిస్తున్నాను. '' టేక్‌ టూ టీ స్ఫూన్స్‌ ఆప్టర్‌ మీల్స్‌ అన్నారు అందుకు '' చెప్పాడు వంశీ.

 సైన్స్‌ మాస్టారు విద్యార్థిని అడుగుతున్నాడు.
'' రవీ! కన్ను, ముక్కు, చెవి వల్ల ఉపయోగలేమిటి?''
'' కళ్లతో అన్నీ చూడొచ్చు, ముక్కుతో శ్వాస పీల్చవచ్చు. చెవులు మీరు గుంజడానికి మెలిపెట్టడానికి పనికివస్తాయి. సార్‌..!''

నేను మీ కూతురిని నాన్న ఎటువంటి తప్పుచెయ్యను అంది అనిత
అందుకనే అమ్మా నా బాధంతా అంటూ నాలిక్కరుచుకున్నాడు ఆచారి.


 టేబుల్‌మీదున్న కాఫీ కప్పుల్లో బూడిద చూసి చాలా కాలం తర్వాత వాళ్ళింటికి వచ్చిన దూరపుచుట్టం రాగిణిని అడిగాడు. '' ఈ బూడిదేమిటమ్మాయి..'' అని.
'' అది మా ఆయనది అంకుల్‌!'' అంది
''అయ్యయ్యో! ఎన్నాళ్ళయిందమ్మాపోయి? నాకసలు ఆ విషయమే తెలీదు.. ఇంత చిన్న వయసులో అబ్బాయిని తీసుకుపోయి ఆ దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడమ్మా...'' అంటూ సానుభూతి కురిపిస్తున్నాడు చుట్టం.
'' అహ! ఆయన పోలేదంకుల్‌. మా ఆయన మహా బద్దకం. ఏష్‌ట్రే తెచ్చుకోలేక అప్పుడప్పుడు అందులో వేసేస్తూ ఉంటారు. అది పారబోయ్యాలని ఎప్పటికప్పుడు నేనూ బద్దకిస్తూన్నానంతే...!'' అంది రాగిణి.

'' రెండు రోజులుగా భోజనం చెయ్యలేదు?''
'' పక్కకి వెళ్ళండి.... ఇది క్లీనిక్‌.
'' ఆరే... నేను బిచ్చగాడిని కాదు డాక్టర్‌. ఆకలి కలగటంలేదని మీ దగ్గరికొచ్చాను!''

కొత్త గిటారు కొంటానన్నావు కొన్నావా? అడిగాడు వేణు
లేదురా!
ఎందుకని
మధ్యలో కన్నముందని చెప్పాడు మాధవ్‌

 ఎమ్మెల్యే ఏడుకొండలు కూతురు కుమారిని అడిగింది స్నేహితురాలు.
'' కుమారీ! నీకెన్ని సంబాదాలోచ్చినా కాదంటున్నావట అసలెలాంటివాడు కావాలనుకుంటున్నావు?''
'' పెళ్ళి కానంతవరకూ అతడొక అభ్యర్థిలాగా నేనో ఓటరు లాగ ఉండాలి. పెళ్ళయ్యాక మాత్రం గెలిచిన అభ్యర్థిలాగా నేను ఓటేసిన ఓటరులాగా అతనూ ఉండాలి..'' తెలివిగా చెప్పింది కుమారి.


 ''2,222 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుందిరా?'' అడిగింది టీచర్‌.
'' మార్పేమి ఉండదండి. అప్పుడు భూమి గుండ్రంగానే ఉంటుంది'' అన్నాడు వంశీ.


 '' బంగారమ్మగారూ! ఈ వేళ ఉదయం మీ అబ్బాయి రాళ్ళు విసిరికొట్టి మా వీధివైపు కిటికీ అద్దాలు పగలగొట్టాడు. వాణ్ణి ఏం చేయాలంటారు..?'' అని కోపంగా అడిగింది తాయారమ్మ.
'' కోప్పడకండి... పిల్లలన్న తర్వాత అల్లరిచేయకుండా ఉంటారా? వాళ్ళు ఏదైనా తప్పుచేస్తే శిక్షించడం కాకుండా మంచి మాటలు చెప్పి ఆ తప్పు మరోసారి చేయకుండా చూడాలి..'' నచ్చచెప్పింది బంగారమ్మ
'' అయితే ఓకే... నిజానికి అద్దాలు పగలకొట్టింది మా అబ్బాయి . పగిలింది మీ వీధి కిటికీల అద్దాలు వెళ్ళి చూడండి...'' నవ్వుతూ చెప్పింది తాయారమ్మ.

 రెండు గాడిదలు మాట్లాడుకుంటున్నాయి
ఈ ఎన్నికలలో ఫలానా పార్టి గెలుస్తుందని బెట్‌ కాస్తున్నా నువ్వేమంటావు?అడిగిందొక గాడిద
గెలిస్తే నువ్వు గెలుస్తావు లేకపోతే నేను గెలుస్తాను అంతేకదా అంది రెండో గాడిద

 '' నేనొచ్చే ముందరే మీ అన్నయ్య యేదో అంటున్నాడు. ఏం అంటున్నాడే?'' అడిగింది అపర్ణ.
'' నేను దుర్మార్గుడిని. నువ్వేమో సద్గుణవంతురాలివి. నువ్వు నాకు చెల్లెలుగా ఎలా పుట్టావ్‌?'' అని అడుగుతున్నాడు అంది బిందు.

 ఒక మేస్త్రి మేనేజరు దగ్గరకు వచ్చి అయ్యా పై అంతస్థు మీద నుంచి ఎవరో రంపం పడేసారు అది సరాసరి నా చెవిని కోసుకుంటూ పడిపోయింది నా చెవిని వెతికించి పెట్టండి అంటూ మొరపెట్టుకున్నాడు
వెంటనే మేనేజరు మేస్త్రీ చెవిని వెతికెందుకు ఇద్దరు మనుషులను ఏర్పాటు చేసారు.
అదగో ఇక్కడ ఉంది అంటూ అరిచాడు యాదయ్య ఓక చెవిని చూస్తూ
ఈ చెవి నాది కాదు నా చెవిలో బీడిముక్క వుంది అన్నాడు మేస్త్రి ఆ చెవి చూస్తు

 అమెరికా నుండి వచ్చిన డాక్టర్‌ని ఇంటర్వ్యూ చూస్తూ అడిగాడు విలేకరి.
'' మీరు అక్కడ ఆరు ప్రాణాలు పొసానన్నారుగా - ఆపరేషన్‌ సక్సెసా?''
'' నో....నో.... మీరు పొరబడుతున్నారు. నేను ఆరుగురిని గర్భవతులని చేసానంతే....' బదులిచ్చి నాలిక కరుచుకున్నాడు డాక్టర్‌.

 నేను చేసిన పని మా స్కూల్‌లోని ఎవ్వరు ఆఖరికి మా టీచర్‌ కూడా చెయ్యలేదు అన్నాడు వంశీ తండ్రితో
అవునా యింతకీ ఏమిటా పని? అడిగాడు తండ్రి
నా చేతివ్రాత చదవడం.
 '' మీ ఆయన ఊరికే 'అంభా' అంటూ అరుస్తున్నారేమిటి?'' అడిగింది రజని.
'' రాత్రి మా ఆయనకు గడ్డితిన్నట్టు కలొచ్చిందటలే....'' చెప్పింది రేణుక.

'' నాన్నా..! నాన్నా..! డైనింగ్‌ రూంలో నల్లపిల్లి దూరింది...'' అన్నాడు రమేష్‌.
'' పిల్లులు నల్లగా ఉండి, అవి మనింట్లో ఏదైనా తింటే మనకి చాలా అదృష్టం రా...''
'' నిజమే అయ్యుంటుంది నాన్నా! ఈ వేళ అమ్మ చికెన్‌ బిర్యాని చేసింది అది మేమందరం తినేశాము. నీకని ఉంచింది మాత్రం ఇపుడా నల్లపిల్లి తినేస్తుంది..'' చెప్పాడు రమేష్‌.

.ఆర్డర్‌-ఆర్డర్‌ అరిచారు జడ్జి
రెండు సమోసా ఒక టీ అరిచాడు ముద్దాయి

 '' ఏవయ్యా..! విశ్వనాధం ఈ రోజు కూడా 25 నిమిషాలు ఆఫీసుకు లేటుగా వచ్చావు. ఉద్యోగంలో చేరి ఆరు నెలలయింది. మిగతావాళ్ళంతా కనీసం ఎన్ని గంటలకి వస్తున్నారోనన్న విషయమైనా గమనించావా..?'' అడిగాడు బాస్‌ కోపంగా.
'' అదెలా కుదురుతుంది సార్‌..! వాళ్ళు రోజూ నేనొచ్చేసరికే సీట్లలో ఉంటున్నారు. మరి..'' వినయంగా చెప్పాడు విశ్వనాధం.

''డాక్టర్‌! ఈ మందులు దేనికి సంబంధించినవో కాస్త చెబుతారా?'' అడిగాడు వంశీ.
'' నాకు మాత్రం ఎలా గుర్తుంటాయి? ఆ రోజు నువ్వే రోగంతో వచ్చావో ఆ రోగానివయి
ఉంటాయి!'' అన్నాడు డాక్టర్‌.

మా ఊరి ఏక్సు ఏమ్మేల్యే మా మీద పగతీర్చుకున్నాడు
అంటే ఎలాగేమిటి
అతనిని గెలిపించినప్పుడు మా కోసం మంచినీటిచెరువు తవ్వించాడట యిప్పుడు ఓడించామని కప్పెట్టేస్తున్నాడు.

 '' నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాక రాలేదు. ఎక్కడికి వెళ్ళావోయ్‌?'' అడిగాడు ఆనంద్‌.
'' బ్యూటీపార్లర్‌కి వెళ్ళానండి!'' చెప్పింది భవాని.

 సైన్సు మాష్టారు పాఠం చెబుతూ మధ్యలో ఓ విద్యార్థిని అడిగారు. '' రామూ ఈ టేబుల్‌ మీద ఒక గ్లాసు, అందులో ఆసిడ్‌ ఉన్నాయి. నా చేతిలో ఒక రూపాయి నాణెం ఉంది. నాణెం గ్లాసులో వేస్తే కరుగుతుందా? లేదా?''
'' కరగదు సార్‌..''
'' ఎందుకు చెప్పు చూద్దాం?''
'' చెప్పడానికేముంది సార్‌! నాణెం కరిగేటట్లయితే మీరు గ్లాసులో వేయరుగా..''


 '' మీ ఏరియాలో దోమలెక్కువట కదా? మిమ్మల్నేమి కుట్టావా?'' అడిగాడు వేణు.
'' కుట్టకేం. బాగాకుట్టి అవే రక్తం కక్కుకుని చస్తాయి!'' చెప్పాడు గోపి.

ఓ హోటల్లో గోడగడియారం ఎప్పుడూ 10 గంటల మీదే ఉండటం చూసి మూడు గంటలకు వచ్చిన కస్టమర్‌ అడిగాడు.
'' ఏవండీ! మేనేజరుగారు! మీరింక ఆ గడియారం బాగుచేయించరా..?''
'' బాగుచేయించకపోవడమే మంచిదనిపిస్తోందండీ..! ఎవరొచ్చినా టైము పది అయిందనుకొని ఆకలేస్తుందని భోజనం బదులు టిఫినే మరికాస్త ఎక్కువతిని
వెళ్తున్నారండీ '' అన్నాడు మేనేజరు.


 మా ఆవిడది చాల అరుదయిన అందం అన్నాడు అదర్స్‌
అండ్‌ అర్దంకాక అడిగాడు సుధీర్‌
అదెవ్వరికి కనపడదు చెప్పాడు అదర్సే

 '' రామారావ్‌! ఏవయ్యా..! ఈ వేళ ఏకంగా ఆఫీసుకి గంటలేటుగా వచ్చావ్‌...?'' చిరాకుగా ఫైల్స్‌ చూసుకుంటూ అడిగాడు అప్పారావు.
'' ఇవాళ మా డాబామీద నుండి కింద పడిపోయాను సార్‌!''
'' వాట్‌..వాట్‌..! నీకు డాబా మీద నుండి క్రిందపడడానికి ఏకంగా గంటటైం పట్టిందా?'' మరింత విసుక్కున్నాడు.

 '' పులివేషం వేసుకుని గ్రౌండులోకి వచ్చావేమిటోయ్‌?'' అడిగాడు క్యాప్టన్‌.
'' పులిలా పరిగెడుతూ అవతలి జట్టువాళ్ళు కొట్టిన బాల్స్‌ అన్నీ పట్టుకోవాలని....'' చెప్పాడు ఫీల్డర్‌.

 '' ఇప్పటికి నేను లెక్క పరిసార్లు చేశాను మేడం..'' అంది చిట్టి.
''వెరీగుడ్‌..! ఎన్నిసార్లు చేస్తే అంత బాగా ప్రాక్టీసు అవుతుంది..'' అంది టీచర్‌.
'' కానీ... అన్సరేమిటో తెలియడం లేదు మేడమ్‌..''
'' ఏమిటీ..! అన్నిసార్లు చేసినా ఆన్సరే రాలేదా..?''
'' వచ్చింది మేడం. కాని ఒక్కొసారి ఒక్కొక్క రకం ఆన్సరు వస్తోంది మరి...''

 ఓ క్రికెటరు బ్యాటింగ్‌కని గ్రౌండ్‌లోకి వెళ్లగానే పోన్‌ మ్రోగింది అతని భార్యనుంచా పోన్‌
సారీ! మీ వారిప్పుడే బ్యాటింగ్‌కి వెళ్ళారు అన్నాడు టెలిపోన్‌ ఎత్తిన వ్యక్తి
పర్వాలేదు లైనులోనే వుంటాను అంది క్రికెటర్‌ భార్య.

 టైపిస్ట్‌  తార తన సీట్లో కూర్చొని వయ్యారంగా గోళ్ళరంగు వేసుకుంటోంది. వచ్చి గంటైనా వర్క్‌ మొదలెట్టని తారని చూసి ఒళ్ళుమండిపోయింది సీనియర్‌ టైపిస్ట్‌ చిదానందానికి. నెమ్మదిగా సీట్లోంచి లేచి ఆవిడ దగ్గరకొచ్చాడు.
'' చూడమ్మా తార! నీ వర్క్‌ గురించి బాస్‌కి కంప్లయింట్‌ చేద్దామనుకుంటున్నాను..'' అన్నాడు సౌమ్యంగా.
'' తప్పకుండా చెయ్యండి..'' అంది గోళ్ళరంగు వేసుకోవడంలో పూర్తిగా మునిగిపోయిన తార పరధ్యానంగా.
'' మరి నువ్వు వర్కెప్పుడు మొదలెడతోవో చెప్పు...'' అన్నాడు చిదానందం ఒళ్ళుమండి.
'' నా గురించి పట్టించుకోవడం మానేసి మీరు సీట్లో కూర్చోని మీ పని మొదలెట్టిన మరుక్షణం...'' అంది తార గోళ్ళురంగు మెరుపుకి మురిపెంగా నవ్వుకుంటూ.


 వంశీ నర్సరీలో చేరాక మొట్టమొదటిసారిగా ప్రోగ్రెస్‌కార్డు తీసుకుని పరిగెత్తుకుంటూ ఇంటికివచ్చి తల్లితో అన్నాడు.
'' మమ్మీ! నాకు తెలుగులో దాదాపు వంద మార్కులొచ్చాయి''
'' ఎంత 98?'' అడిగింది తల్లి.
'' కాదు. సున్న'' చెప్పాడు వంశీ

 ఓ బిజినెస్‌ మాగ్నట్‌ తన స్నేహితుడితో ఇలా అన్నాడు.
'' జీవితంలో ఓ కష్టం తీరిందనుకుంటే మరొకటి వచ్చిపడుతోందిరా! అందుకే నేనొక స్కీమ్‌ మొదలుపెట్టాను. ఓ యువకుడిని తీసుకొని నాకొచ్చే సమస్యల్ని బాధల్నీ అతనికప్ప చెప్పేస్తున్నా..''
'' అయితే అవన్నీ భరించేందుకు అతడికి జీతమెంతిస్తున్నావ్‌..?'' అడిగాడు స్నేహితుడు.
'' అయిదువేలు..''
'' ప్రతినెలా అంత డబ్బెక్కడినుంచి తేగలవు..?'' సందేహం వెలిబుచ్చాడు
'' అదే అతడి మొదటి వర్రీ అవుతుంది మరి..''


 మీ తరంవాళ్ళకు సిగ్గు, అణుకువలేదు నేను స్కూల్‌కెళ్లె రోజులలో నీ వయస్సు అమ్మాయిలు ఎంత సిగ్గుపడేవారో కూతురికి హితబోద చేస్తు అన్నాడు తండ్రి
కూతురు కొద్దిక్షణాలు ఆలోచించి ఆసక్తిగా అడిగింది వాళ్ళు సిగ్గుపడేలా ఏం చేసేవారు నాన్న

 అపర్ణ, మాధవ్‌లు బెడ్‌ మీదుండగా అపర్ణ భర్త గదిలోకి వచ్చి '' ఏమిటి మీరు చేస్తున్నది?'' అంటూ కోపంగా అరిచాడు.
మాధవ్‌ వెంటనే మంచం దిగి, బట్టలు తొడుక్కుని '' భార్యభర్తల కొట్లాటల మధ్య పరాయివారుండడం బాగుండదు'' అంటూ వెళ్ళిపోయాడు.

 '' ఈ రాత్రికి మా ఫ్రెండ్‌ బాబూరావ్‌ని మనింటికి డిన్నర్‌కి పిలుద్దామనుకుంటున్నాను లతా..!'' చెప్పాడు ఫోనులో రాజారావ్‌.
'' ఏమిటి డిన్నర్‌కా..! మీకేమైనా బుద్దుందా అసలు. ఓ మూల వంటవాడు మానేశాడు. స్టౌబర్నర్‌లు సరిగా మండటం లేదు. నానిగాడికి జ్వరం, అప్పు పూర్తిగా తీరిస్తే కాని కిరాణా కొట్టువాడు సరుకులివ్వడు..'' ఆమె దండకం పూర్తికాకుండానే అన్నాడు రాజారావ్‌.
'' అందుకే లతా! పిలవడం పాపం ఆ వెర్రివెధవ పెళ్ళి చేసుకోవాలని తెగ ముచ్చట పడుతున్నాడు..'' అంటూ ఫోను పెట్టేశాడు రాజారావ్‌.

.ఈ మధ్య శ్రీనివాస్‌ అస్సలు కనబడడం లేదు అంది కమల
నీకు శ్రీనివాస్‌కి పెళ్లయిందిగా ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి
అయ్యింది లేకపోతే కనబడడం లేదని యెందుకంటాను అంది కమల

 '' ప్రకృతిలోని ప్రతిజీవి నుండి ఏదో ఒక గుణాన్ని నేర్చుకోవచ్చునన్నారు పెద్దలు. ఆ ప్రకారం దోమనుండి మనం నేర్చుకోదగినది ఏమిటి..?'' అనడిగింది టీచర్‌.
'' ఇతరులను కొట్టి (కుట్టి) బాదించి ఆనందించవచ్చు. అదే దోమల నుండి ముఖ్యంగా నేర్చుకొనే అంశమండీ'' అన్నాడు విద్యార్థి.

 '' ఈ ఇంటి గోడలనిండా పుట్టలకొద్దీ చీమలున్నాయేమిటి?'' అడిగాడు రఘు.
'' మాది స్వీట్‌షాపు కదా! ఈ యింటికి ఇటుకలు బదులుగా మైసూర్‌పాక్‌లని ఉపయోగించాను, అంతే.....'' చెప్పాడు రాజు.

 ఇది సరికొత్త పాలసీ మేడం విరిగిన ప్రతికాలుకీ, ప్రతి చెయ్యికి వెయ్యిరూపాయల చొప్పున యిస్తాం అన్నాడు ఎజెంట్‌
ఓరిదెవుడా వాటినన్నింటిని మీరేంచేసుకుంటారు ఆశ్చర్యంగా అడిగింది అన్నపూర్ణ

 '' అప్పు ఎగ్గొట్టడం ఎలా? అనే విషయం పై మీరు వ్రాసిన గ్రంథం రికార్డుస్థాయిలో అమ్ముడపోయింది కదా! తరువాత ఏ గ్రంథం వ్రాయబోతున్నారు?'' అడిగాడు విలేఖరి. రచయిత రంగనాధాన్ని.
'' అప్పు రాబట్టుకోవటం ఎలా?'' అన్న గ్రంథం!''

 మీరు ఈసారి స్పోర్ట్సు కోటాలో మంత్రి పదవిని డిమాండ్‌ చేస్తున్నారు కదా మీరు నైపుణ్యం సంపాదించిన ఆట పేరేమిటో చెబుతారా అడిగాడు విలేకరి రాజకీయనాయకుడిని
పోట్లాట ఠక్కున అన్నాడు రాజకీయనాయకుడు

 '' మీ గ్రామ ఎన్నికలలో సర్పంచ్‌గా ఎవరు గెలిచారోయ్‌?'' అడిగాడు శేషు.
'' నేనే!''
'' నువ్వసలు నామినేషన్‌ వేయలేదుకదరా?'' ఆశ్చర్యపోయాడు శేషు.
'' అవును. మా వూర్లోని వాళ్ళందరూ నామినేషన్‌ వేసారు. చివరికి ఎవరిని ఎన్నుకోవాలో తెలియక నామినేషన్‌ వేయని నన్ను అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు'' చెప్పాడు లక్ష్మణ్‌.

 ఓ బాస్‌ తన క్రింద పనిచేసే ఉద్యోగస్తుడు నెలరోజులు శెలవు కావాలని లీవ్‌ లెటర్‌ తేస్తే అడిగాడు కోపంగా నీకు ఎప్పుడు శెలవు కావాలి మీ అత్తగారికి బావుండలేదంటావు నీ కూతురికి జ్వరమంటావు ఇప్పుడేం కారణం?
నా పెళ్ళి సార్‌ చెప్పాడు వంశీ

. '' ఇన్నేసి అబద్దాలడుతున్నావు, ఎవరు నేర్పించారోయ్‌?'' అడిగారు మాష్టారు.
'' ఎవరూ నేర్పించలేదండి! మా నాన్నగారి నుండి వంశపారంపర్యంగా నాకు అలవాటయిందండి'' అన్నాడు వంశీ.
'' అలాగా! ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తారు?''
'' లాయరండి!''

 ఒకడు నదిలోనిపడవలో నిల్చోన్నాడు అనుకోకుండా నదిలో పడి రక్షించండి-రక్షించండి అని అరవసాగాడు.ఇదంత వింటున్న అతడి భార్య అతడికి ఈతరాదని తెల్సికూడా ఎందుకు ఒడ్డుకొచ్చేస్తుంది అడిగింది టీచర్‌
అతని యిన్సురెన్సూ సొమ్ము తీసుకోవడానికి-అన్నాడు సంపత్‌

 '' గట్టిగా వున్న పళ్ళని పీకమంటున్నారేమిటండీ?'' ఆశ్చర్యంగా అడిగాడు పళ్ళ డాక్టర్‌.
'' నా ప్రత్యర్థి పళ్ళు రాలగొడ్తానని బెదిరిస్తున్నాడండి. వాడికి ఆ ఛాన్స్‌ ఇవ్వకూడదని '' చెప్పాడు వంశీ.

 నీ స్నేహితుడు రమేష్‌ దొంగతనం చేసాడనే అభియోగంవుంది అతడి గురించి నువ్వెమయిన చెబుతావా? అడిగాడు ఇన్‌స్ఫెక్టర్‌
ఎంత డబ్బుపోయిందో చెప్పండి దొంగతనం చేసాడో లేదో తరువాత నేను చెబుతాను అన్నాడు కుమార్‌

. '' నా అభిమాన నటుడి సినిమా బిగినింగ్‌ నుంచి ఫైటింగే!''
'' ఓస్‌ అంతేనా? నా అభిమాన నటుడి సినిమా బుకింగునుంచి ఫైటింగే!''


 '' అయామ్‌సారీ! నిన్ను వారం రోజులు ఎక్కువగా జైల్లో ఉంచాం పొరబాటున..'' అంటూ ఖైదీని విడుదల చేశారు జైలు అధికారులు.
'' భలేవారండీ తమరు. ఎప్పుడు విడుదలైతే ఏమిటి? ఎలాగైనా పదిరోజుల్లోనే మళ్ళీ ఇక్కడకి రావాల్సిన వాడినేగా..! ఈసారి వచ్చినప్పుడు ఈ పదిరోజులూ అందులో మినహాయింపు ఇద్దురుగానిలెండి..'' అన్నాడు ఖైదీ.

 ప్రపంచంలోకెళ్ళ అందమైన యువతినే పెళ్ళిచేసుకోబోతున్నట్లు నిన్న నా ప్రియుడు నాతో అన్నాడే గొప్పగా అంది కమల
మరప్పుడోప్పుడో నిన్ను పెళ్ళిచేసుకుంటానని మాటిచ్చాడనుకుంటా అనుమానంగా అడిగింది లక్ష్మీ

 '' ఎలా ఉన్నారు?'' అడిగాడు రమేష్‌.
'' కనపడట్లా? దుక్కలా ఉన్నాను!'' కోపంగా అన్నాడు కుమార్‌.

 హైదరాబాద్‌ మహానగరంలో ఓ షాపులో ఫ్రేముచేసి భారతదేశ నాయకుల ఫోటోలు అమ్ముతున్నారు. మారు వేషంలో ఉన్న మాజీముఖ్యమంత్రి చిదానందం షాపు నిండా మొత్తం తన ఫోటోలే కనిపించడం చూసి పొంగిపోయాడు. ఎంతో సంతోషంగా షాపులోకి వెళ్ళి షాపు ఓనర్ని ''చూడు బాబూ..! షాపులో కేవలం చిదానందంగారి ఫోటోలు మాత్రమే వేలాడదీశావు. వీటితో బాటు గాంధీ, నెహ్రూవంటి జాతీయ నాయకులు, పొట్టి శ్రీరాములు, ఎన్‌.టి. రామారావు వంటి ప్రాంతీయ నాయకుల ఫోటోలు కూడా వ్రేలాడదీయలేకపోయావా..?'' అనడిగాడు.
ఆ షాపువాడు '' మీరు చెప్పినట్లు వాళ్లందరి ఫోటోలు ఇక్కడ వ్రేలాడదీశామండి. అవన్నీ పెట్టిన వెంటనే అమ్ముడైపోయాయి. కాని ఈ బోడి చిదానందం ఫోటోలు మాత్రం సంవత్సరం నుండి ఇలాగే వ్రేలాడుతున్నాయి..'' అన్నాడు.
అంతే..! ఎందుకడిగానురా బాబూ..! అని మనసులోనే గొణుక్కుంటూ మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు చిదానందం.

 నేను మా స్కూలుకి ఒకరోజు కూడా మానను అన్నాడు అనూప్‌
ఎందుకని అడిగాడు కార్తీక్‌
చదివి బాగుపడిన బాగుపడకపోయిన బరువులు మోసయిన బతకవచ్చునని.

 '' ఈ జటిలమైన కేసులో తీర్పు చెప్పాలంటే ఆ ఏడుకొండలవాడే దిగి రావాలి'' అన్నాడు తనలో తానే మాట్లాడుకున్నట్లుగా జడ్జిగారు. అక్కడున్న బంట్రోతు బయటకు పరుగెత్తి '' ఏడుకొండలూ..ఏడుకొండలూ..'' అనరిచాడు. కొద్ది నిమిషాల తర్వాత జడ్జిగారు వద్దకు వచ్చి '' ఏడుకొండలవాడు రాలేదు సార్‌..! ఎంత పిలిచినా జవాబు లేదు..'' అన్నాడు వగరుస్తూ.

. '' మా వారు వట్టి పప్పుసుద్ద''
'' ఎలా చెప్పగలరు?''
'' ఏనాడయినా కొడితే అలుగుదామని నా కోరిక. ఆయన తీర్చనే తీర్చరు.''

 కొత్తగా పెళ్ళయింది ఆనందరావుకి భార్య కాపురానికొచ్చింది. ఓ రోజు ఆమె చేసిన రెండు మూడు రకాల వంటకాలు చవిచూసి '' ఛి..ఛీ... ఇవసలు వంటలేనా? పరమ ఛండాలంగా ఉన్నాయి..'' అన్నాడు ఆనందరావు.
'' అలా కోప్పడకండి. ఒక్క రెండు వారాలు ఓపిక పట్టండి..'' వినయంగా అంది భార్య
'' ఏం..? అప్పటికి బాగా తయారుచేస్తావా..?''
'' కాదు..మీరే ఈ వంటకాలకి అలవాటు పడిపోతారు.''

 ఎలావుందే నువ్వు చదువుతున్న నవల?అడిగింది సరిత
ఏం బాగలేదు పుస్తకం సగమయిపోయిన-యింకా హిరోయిన్‌ ఒక్కడినే అంటిపెట్టుకుని వుంది అంది బిందు.

 '' జైలులో వుండి రోజూ జైలుకూడు తినడానికి సిగ్గుగా లేదూ?'' ముద్దాయిని ప్రశ్నించాడు జడ్జి.
'' నాకెందుకండి సిగ్గు. ఎందరో రాజకీయ నాయకులే ప్రతిరోజూ జైలుకూడు తింటున్నారు. అటువంటివారు తింటున్న కూడు తింటున్నందుకు గర్వంగా వుంది'' అన్నాడు ముద్దాయి.

 ఈ బస్సు నడిపే డ్రైవర్‌కి అసలు జాలిగుండెనేదిలేదు! ఎలా చెప్పగలవు
కండక్టర్‌ జనాల్ని చూసి లేచి తన సీటిచ్చాడు డ్రైవర్‌ మాత్రం అస్సలు తన సీటులోంచి లేవనే లేవలేదు.

 '' భార్యపోయిన రెండవరోజునే పెళ్ళిచేసుకున్నావా?'' అడిగాడు రమేష్‌.
'' సంతోషాన్ని ఎక్కువకాలం దాచుకునే మనస్తత్వం కాదు నాది'' అన్నాడు కుమార్‌.

.అంత అందమయిన వాడిని ఎక్కడ కలుసుకున్నావు అడిగింది పావని
ఆ మధ్య ఊటీకి హనీమూన్‌ కి వెళ్లీనప్పుడు కనిపించాడులే సిగ్గు పడుతూ చెప్పింది సుధ


. కొత్తగా పట్నంలో దిగి మంచి ఏరియాలో ఇల్లుచూసి నివాసమేర్పరచుకుందా కుటుంబం. ఆ సాయంత్రం ఇంటి ఇల్లాలు కూరలు కొనడానికి ఓ షాపులోకి అడుగుపెట్టింది. రెండు ట్రేలలో టమోటాలున్నాయి. రెండు ట్రేలలోనివీ ఒకే రకం టమోటాలు. వాటి ధర అడిగితే మాత్రం '' ఒక దాంట్లోవి కేజీ పన్నెండు రూపాయలు, మరోదానిలోనివి కేజి ఇరవై రూపాయలు..'' అన్నాడు షాపువాడు.
'' ఈ రెండు ఒకే రకం, కాని ధరల్లో తేడా ఎందుకు?'' అర్థంకాక అడిగిందా ఇల్లాలు.
''ఏముంది మేడం! కొందరు ఎక్కువ ఖరీదైనవే కొందామనుకుంటారు. ఆ మొదటి ట్రేవి అలాంటివారి కోసం. మరి కొందరు వీలైనంత తక్కువ ధరలోనే కావాలనుకుంటారు. ఆ రెండో ట్రేలోవి ఇలాంటి వారి కోసం...'' అన్నాడు షాపువాడు వినయంగా.

. '' ఐ లవ్‌ యూ, ఐ లవ్‌ యూ, ఐ లవ్‌ యూ!''
'' పెళ్ళి చేసుకుంటావా?''
'' టాఫిక్‌ మార్చకు!''

. ఒక గుమాస్తా ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతోంది. ఇంటర్వ్యూ అధికారి కాండిడేట్‌ని ప్రశ్నించాడు.
'' ఏవయ్యా! సూర్యుడు భూమికెంత దూరంలో ఉన్నాడు..?''
''పై నున్న సూర్యడు భూమికి దగ్గరగా రావలసిన పనిలేదనుకుంటాసార్‌..!'' అన్నాడా అభ్యర్థి.

. నా నెక్లెస్‌ పోయింది నా హేండ్‌ బ్యాగ్‌ తప్ప మిగిలిన అన్ని చోట్ల వెతికాను కాని దొరకలేదు అంది కమల
మరి హేండ్‌ బ్యాగ్‌ వెతకొచ్చుగా అడిగింది లక్ష్మి
అక్కడ లేకపోతే నాకు దు:ఖం ఆగదని వెతకటం మానేశాను చెప్పింది కమల

. '' చిన్న ఆలోచన చాలు యెన్నో విడాకులు తప్పిపోకడానికి!''
'' అంతే చిన్న ఆలోచనే చాలు యెన్నో పెళ్ళిళ్ళు తప్పిపోవడానికి!''

. '' రాజూ..! ప్రపంచంలో ఎన్నో సిటీలున్నాయి. వాటిలో భారీగా కనిపించే, శక్తివంతమైన సిటీ ఏమిటో చెప్పు..?''
'' ఎలక్ట్రిసిటీ సార్‌..!''

. '' నీ బాయ్‌ఫ్రెండ్‌ ఎలాగున్నాడోయ్‌?'' అడిగింది హైమ.
'' నువ్వు ఎవరిని గురించి అడుగుతున్నావో ముందర చెప్పు తరువాత ఎలాగున్నాడో నేను చెబుతా'' అంది స్రవంతి.

. పాపారావు పాపాయిని గాఢంగా ప్రేమించాడు. పాపాయి లేనిదే జీవించలేననే నిర్ణయానికొచ్చాడు. ఒకరోజు పాపాయి వద్దకు వెళ్లి '' పాపాయీ..! నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. నీ కోసం ఏమైనా చేస్తాను. అంతేకాదు నీకు నా ప్రేమ కాదంటే చచ్చిపోతాను'' అన్నాడు.
పాపాయి పాపారావు ప్రేమను నిర్మోహమాటంగా తిరస్కరించింది పాపం..! పాపారావు చనిపోయాడు మరో అరవయ్యేళ్ళ తరువాత.

. మీకు వివాహం అయ్యిందా హిరోయిన్ని అడిగాడు విలేకరి
అప్పుడప్పుడు చెప్పింది హిరోయిన్‌

. '' నాన్న మూఢనమ్మకం అంటే ఏమిటి?'' అడిగాడు కొడుకు.
'' నువ్వు యీ సారయినా పాసవుతావనుకోవడం '' చెప్పాడు తండ్రి.

. నిన్నంతా ఎద్ధులా పనిచెయ్యడంతో జ్వరంవచ్చిందండీ యజమానితో మొరపెట్టుకున్నాడు పనివాడు
అయ్యో పాపం కాసేపు అలా కూర్చో పశువులడాక్టర్‌కి కబురంపుతాను అన్నాడు యజమాని

. '' కాళ్ళే ఎందుకురా పట్టుకుంటావు, దొంగ వెధవా!'' దొంగతనం చేస్తూ పట్టుబడ్డ దొంగని కోపగించుకున్నాడు పోలీస్‌.
'' ఈ టైములో మీ కాళ్ళకు విలువ ఎక్కువ సార్‌!'' అన్నాడు దొంగ.

 నిజం చెప్పు ఈ హోమ్‌వర్క్‌ ఎవరు చేసారు వంశీని గద్దించింది టీచర్‌
మా నాన్నగారండీ
ఆయనొక్కరే చేసారా
లేదండి మధ్యలో నేను కూడా సహాయం చేసానులెండి.. అన్నాడు వంశీ

. చిదంబరం సైకిల్‌ తొక్కుకుంటూ రోడ్డుమీద వెళ్తున్నాడు. అమలాపురం గడియార స్థంభం వద్దకు వెళ్ళేసరికి చాలామంది జనం గుమిగూడి కనిపించారు. చిదంబరం సైకిల్‌ ఆపి ఒక ఆసామిని '' ఏమైంది..?'' అనడిగాడు.
'' ఏక్సిడెంట్‌ అయింది..'' అని చెప్పి వెళ్ళిపోయాడతను. చిదంబరం ఏక్సిడెంట్‌ ఎవరికైందో చూద్దామని జనాన్ని తోసుకుంటూ లోపలికి వెళ్లబోయాడు. కాని ఎవరూ దారి ఇవ్వలేదు. చిదంబరంకి వెంటనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. '' నాన్నా! చచ్చిపోయావా నాన్నా.. అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయా..?అని ఏడుపు నటిస్తూ జనాన్ని తోసుకుంటూ లోనికి వెళ్ళాడు. తీరా లోనికి వెళ్లి చూస్తే అక్కడ ఒక గాడిద చచ్చిపడి ఉంది.


 '' ఏమిటి నర్స్‌! రేపు ఆపరేషన్‌ చేయబోయే ఆ పేషెంటుతో ఏమన్నావు? వెనక్కి తిరిగయినా చూడకుండా పారిపోతున్నాడు?'' ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్‌.
'' ఆపరేషన్‌ అయ్యాక ఏం చేస్తారు? అని అడిగాడు. మీ బంధువులకి అప్పగిస్తాము అన్నాను. పొరపాటుగా అర్థం చేసుకున్నట్లున్నాడు డాక్టర్‌'' అంది నర్స్‌.

 పోస్టల్‌ డిపార్టుమెంట్‌లో పనిచేసే కన్నారావు తన మిత్రుడు చిన్నారావు వద్దకు అప్పుకోసం వెళ్ళాడు.
'' చిన్నారావు.. నాకొక రెండొందలు అప్పు కావాలిరా! నీవు రెండొందలు ఇస్తే వాటికి మరో రెండొందలు వడ్డీ కలిపి మొత్తం నాలుగొందలుతో నీ బాకీ తీరుస్తాను..'' అనడిగాడు.. ''నిజంగా...నాలుగొందలిస్తావా..? అయితే ఇప్పుడే రెండొందలిస్తాను. మరి నాలుగు వందలు తిరిగి ఎప్పుడిస్తావు..?''
'' అయిదున్నర సంవత్సరాల తర్వాత..''

 యిప్పుడు నేనో గొప్ప కవితను విన్పించబోతున్నాను అయితే అది వ్రాసింది నేనుకుదు టి.వి.స్టేషన్లో కలుసుకున్న యిద్దరు కవులలో ఒక కవి అన్నాడు.
గొప్ప కవిత అనగానే అది మీరు వ్రాయలేదని అర్థమయ్యిందిలెండీ అన్నాడు రెండోకవి

 '' డాడీ...డాడీ.... ఎప్పుడూ యింట్లోనుంచి కదలనీయవు. అలా బయటకెళ్ళి కాసేపు గోలీలాడుకుని వచ్చేస్తాను డాడీ'' బ్రతిమాలాడు వెంకట్‌
'' నోరు మూసుకుని ముందర ముక్కపడేయ్‌!'' అన్నాడు భానుమూర్తి పేకముక్కల్ని సరిచేసుకుంటూ.

1087 . క్లాసులో మాస్టారు పాఠం చెబుతూ విద్యార్థిని అడిగారు.
'' గిరీ..! నీవు ఒక పడవలో ప్రయాణిస్తున్నవనుకుందాం. దానికొక చిల్లుపడి నీరు లోపలికి వచ్చేస్తుంటే అపుడు నీవేం చేస్తావు..?''
'' ఆ చిల్లు కుడిపక్కన ఉంటే నేను మరో చిల్లు ఎడమ పక్కన పెడతానండీ. ఎందుకంటే కుడిపక్క నుండి వచ్చేనీరు ఎడమపక్కనుండి బయటకు వెళ్ళిపోతుంది కదా..!'' అంటూ సమాధానం చెప్పాడు గిరి.

1088 . నీ ఆఖరి కోరికేమిటి అడిగాడు జైలర్‌
మా ఆవిడను పిలిపించండి కసితీర తిట్టాలని వుంది

1089 . '' నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది''
'' ఇంటర్వ్యూలో ఏం అడిగారేమిటి?''
'' ఏమీ అడగలేదు, ఇంటర్వ్యూకి నిద్రలో వెళ్ళా. అంతే...''

 ''అమ్మా..అమ్మా..! ఈ వేళ క్లాసులో మా టీచరు నన్ను బాగా చితక్కొట్టింది'' ఏడుస్తూ చెప్పింది చిట్టి తల్లి తాయారుతో. మరుసటి రోజు తాయారు కూతుర్ని వెంటబెట్టుకుని క్లాసుకి వెళ్ళి '' మా అమ్మాయిని ఎందుకు కొట్టారు?'' అని నిలదీసింది.
'' మీ అమ్మాయి బాగా అల్లరి చేస్తుంది. మరి అలాంటప్పుడు కొట్టక ముద్దు పెట్టుకుంటామా..?'' అడిగింది టీచర్‌.
'' చూడండి మా అమ్మాయి ఈసారి అల్లరి చేస్తుంటే పక్కమ్మాయిని బాగా చితక్కొట్టండి. ఆ అమ్మాయిని చూసి మా అమ్మాయి బుద్ది తెచ్చుకుంటుంది..'' తెలివిగా సలహా ఇచ్చింది తాయారు.

 మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావు అడిగాడు రమేష్‌
మా నాన్న గుణవతి, శీలవతి, విధ్యావతి అయిన అమ్మాయిని పెళ్ళిచేసుకోమని కోరుతుండడంతో చెప్పాడు కుమార్‌.

. ఒక సినీ నటి తన కుటుంబంతో సహా ఓ కొత్తింట్లో దిగింది. కారం రోజుల తర్వాత భర్తతో'' ఏవండీ..! ఎదురింటి అబ్బాయి నేను వచ్చిన దగ్గర్నుండి నన్ను చడాలని నా కోసం కర్టెన్ల చాటు నుండి దొంగచూపులు చూస్తున్నాడండీ..'' అంది.
'' ఓస్‌.. అంతేకదా... ఓ పనిచేయ్‌. రేపు ఉదయం నీవు షూటింగ్‌కి వెళ్ళేముందు ముఖానిక మేకప్‌ లేకుండా ఓసారి ఆ అబ్బాయికి కనిపించు అంతే.. మళ్ళీ నీ ముఖం చూడకుండా తనే కర్టెన్లు వేసుకుంటాడు...'' చెప్పాడు భర్త.


1093 . '' మా గ్రామంలో గత పదేళ్ళుగా 1311 మంది జనాభా మాత్రమే నివసిస్తున్నారు'' చెప్పాడు రమేష్‌.
'' అదెలా సాధ్యం? ఎవరికీ పిల్లలు పుట్టరా మీ గ్రామంలో?'' ఆశ్చర్యంగా అడిగాడు కుమార్‌.
'' పుడతారు! పుట్టగానే ఓ బ్రహ్మచారి ఈ గ్రామంలో వదిలిపెట్టిపోతుంటాడు'' చెప్పాడు రమేష్‌.

1094 . ఒక బస్సు చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అకస్మాత్తుగా ఆ బస్సు నడిపే డ్రైవర్‌ పడీపడీ నవ్వసాగాడు. డ్రైవర్‌ ఎందుకు నవ్వుతున్నాడో అర్థంకాక డ్రైవర్‌ పక్కన కూర్చొన్న ఓ ప్రయాణీకుడు '' డ్రైవర్‌ గారూ.. ఎందుకండీ మీరు అంత బిగ్గరగా నవ్వుతున్నారు?'' అనడిగాడు.
'' ఏమీ లేదండీ. ఏదైనా ఘోర ప్రమాదం జరగబోయేముందు దాన్ని గుర్తించగల్గినపుడు నేనిలాగే నవ్వుతూ ఉంటాను...'' అన్నాడు డ్రైవర్‌.
'' అది సరే. మరిప్పుడు ఎందుకు నవ్వుతున్నారు..?'' మళ్ళీ అడిగాడు ప్రయాణీకుడు.
'' మరికొద్దీసేపట్లో ఘోరప్రమాదం జరగబోతోంది. మన బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి.'' అసలు విషయం చెప్పాడు డ్రైవర్‌.

ఏడాదిపాటు మా ఆయన సాయంత్రాలు యెక్కడ గడుపుతున్నాడో అని ఆలోచిస్తుండే దానిని చివరికి తెలిసింది.
ఏం తెలిసిందేమిటి అడిగింది హైమా
ఏముంది ఓ రోజు కేసు క్లబ్‌కి వెళ్లలేదు ఆయన ఇంట్లోనే గడుపుతున్నారని తెలిసింది అంది స్రవంతి

 ఒక వ్యక్తి బస్టాండులో నిలబడి పేపరు చదువుకుంటున్నాడు. అంతలో మరో వ్యక్తి వచ్చి అతని చేతిలో పేపరు లాక్కొని సీరియస్‌గా చదువుకోసాగాడు.
'' ఏవయ్యా! నీకసలు బుద్దుందా? నా చేతిలో పేపరు లాగేసుకొని నీవు చదువుకుంటున్నావేమిటి?'' అనడిగాడు మొదటి వ్యక్తి.
'' చూడండీ..! పేపరు మీది. మీరు ఇంటికి వెళ్ళిన చదువుతారు. నేను చదివి ఇచ్చేస్తాను కాస్త ఆగండి..'' అన్నాడు రెండో వ్యక్తి.
'' కాస్త మీరు నోరు మూసుకుంటారా. మీరు వాటాలు వేసుకోవడం ఆపి ఆ పేపరు ఇటివ్వండి. అది మీది, ఆయనదీ కాదు. నాది...'' అంటూ అరిచాడు వాళ్ళ వెనుకనే ఉన్న మూడవ వ్యక్తి.


1097 . '' వయోజన విద్య పాఠశాలలో టీచర్‌గా ముసలమ్మని నియమించడం తప్పయిపోయింది''
'' ఏం జరిగిందేమిటి?''
'' స్కూలుకొచ్చే ముసలొళ్ళంతా ఆవిడకి సైట్‌కొట్టడం ప్రారంభించారు''

1098 .అరడజను సూపర్‌బజార్‌లు తిరిగిన నాకు కావలసినది దొరకలేదు?
అలాగా ఇంతకి నీకు కావలసినది
అప్పు

 '' వదినా..వదినా..! నీకొక షాకింగ్‌ న్యూస్‌ చెప్పానా.. ఆ ఎదురింటి విమలమ్మ కూతురు రాత్రి ఎవడో పనికిమాలిన వెదవతో లేచిపోయిందట..'' చంకలు గుద్దుకుంటూ సంతోషంగా చెప్పింది కమలమ్మ.
'' అంతేనా..! నీకింకా షాకింగ్‌ న్యూస్‌ చెప్పమంటావా వదినా..! ఆ విమలమ్మ కూతుర్ని లేపుకుపోయింది మీ అబ్బాయేనట..'' అసలు విషయం చెప్పింది రమణమ్మ.

 '' మా ఆయన పుస్తకాల పురుగు ఆయనని చూసి మావాడు చెడిపోయాడు'' బాధపడింది రేణుక.
'' అస్సలు పుస్తకాలు వదలట్లేదా?'' అడిగింది రజని.
'' కాదు. నాన్నగారంతయ్యాక చదువుకంటానని ఇప్పుడు చదవడం మానేస్తున్నాడు!'' మరింత బాధగా చెప్పింది రేణుక.

. నా భార్యను రెండో అంతస్థుమీద నుంచి తోసేసాను నన్ను జైల్లొ పెట్టండి ఇన్‌స్పెక్టర్‌ తొ మొరపెట్టుకున్నాడు
ఆమె మరణించిందా అడిగాడు ఇన్‌స్పెక్టర్‌
లేదండి అందుకే జైలొ పెట్టమంటున్నాను చెప్పాడు వంశీ

'' మీ ఫ్రెండ్‌ అచ్చం మీలాగానే తయారవ్వుతానంటే ఒప్పుకున్నారుగా. ఇప్పుడు ఏడవండి!'' అంది భవాని.
'' ఏం చేశాడేమిటి?'' అడిగాడు ఆనంద్‌.
'' మీరు నాతో కాపురం చేస్తున్నారట. అతను కూడా నాతో కాపురం చేస్తానంటున్నాడు!'' చెప్పింది భవాని.

 1103 . యిక మీతో కాపురం చెయ్యడం నా వల్లకాదు ఏ రైలుకిందో తలపెడతాను
ఇదిగో రైల్వే టైంటేబుల్‌ అందిచాడు ఆచారి

1104 . ఇంటికి త్వరగా వచ్చి భార్య పాలవాడితో గడపటం గమనించాడు భర్త. అంతే వెంటనే కోపం వచ్చేసింది. భార్య మీద అరుస్తూ అన్నాడు '' పాలవాడితో గడిపి ఇలా సమయాన్ని వృధా చేయడానికి సిగ్గులేదు? అవతల ఆరునెలల ఇంటి అద్దెని ఇంటి ఓనర్‌ అడుగుతుండగా?''

1105 . మొన్న పక్కసందులో పడిన దొంగ చచ్చిపోయాడట అన్నాడు కుమార్‌
అలాగా వాడిని పోలీసులు అరెస్టుచేసి లాకప్పులో పెట్టిన సంగతే నాకు తెలియదు అన్నాడు రమేష్‌

1106 . '' ఎప్పుడు ఇంగ్లీషు నవలలు చదువుతుంటావు, తెలుగు నవలలంటే గిట్టవా?'' అడిగాడు రమేష్‌.
'' అదేంకాదు. ట్రాన్స్‌లేషన్‌ చదివేకంటే డైరెక్టుగా చదివితేనే నాకు థ్రిల్లింగ్‌ గా ఉంటుంది.'' చెప్పాడు కుమార్‌.

ఏమే లక్ష్మి! మీ ఆయన పేనేమిటి? పనిమనిషిని అడిగింది కమల
లక్ష్మీపతండి

 ఇద్దరు వ్యక్తులు బస్టాండులో నిలబడి ఉన్నారు. వాళ్ళ సంబాషణ ఇలా ఉంది.
'' సార్‌..! మిమ్మల్నెక్కడో చూసినట్లుంది అసలు మీది ఏ ఊరు..?''
'' పల్లంకుర్రు..''
'' నిజమా! అరె మాది పల్లంకుర్రే..''
'' మీది ఏ వీధి..?''
'' బ్యాంకు వీధి...''
'' హా.. మాదీ బ్యాంకు వీధే...''
'' మీ ఇల్లెక్కడా...?''
'' అరె.. మాదీ బ్యాంకు పక్కనే ఉన్న డాబాలో పై అంతస్తు...''
'' అరె... మాదీ అంతే...! పై అంతస్తే...''
ఈ సంభాషణ విన్న మూడోవ్యక్తి చిరాగ్గా '' అదేమిటయ్యా! మీ ఇద్దరివీ ఒకే ఊరు, ఒకే వీధి, ఒకే ఇల్లు అంటున్నారు. ఎప్పుడూ ఒకర్నొకరు చూచుకోలేదా?''
'' భలేవారే..! ఎందుకు చూసుకోమూ. మేమిద్దరం అన్నదమ్ములం. ఎంతసేపటికి బస్సురావట్లేదని టైంపాస్‌ కోసం ఇలా మాట్లాడుకొంటున్నాం అంతే..!'' అంటూ అసలు విషయం చెప్పారు ఆ ఇద్దరిలో ఒకరు.

 ''మా అత్తగారితో నేను పోట్లాడే పోట్లాట మా ఊరంతా చాల పాపులారిటిని సంపాదించుకుంది!''
'' ఎలా చెప్పగలవు?''
'' మేమిద్దరం పోట్లాడుకుంటున్నప్పుడు కొంతమంది కంపెనీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపి మరీ ఎడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చి పోతున్నారు!''

 అప్పారావు ఓ ప్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్‌ అయ్యాడు.
'' చూడు అప్పారావ్‌..! నీ జీతం ప్రస్తుతం వెయ్యి రూపాయలు. రెండవనెల రెండువేలు, మూడవ నెల మూడువేలు. ఈ విధంగా ప్రతినెల వెయ్యి రూపాయల చొప్పున పెరుగుతూ ఒక సంవత్సరానికి నీ జీతం పన్నెండు వేలు అవుతుంది...'' అన్నాడు మేనేజరు.
'' అలాగా సార్‌..! అయితే నేను సంవత్సరం తర్వాత వచ్చి జాయిన్‌ అవుతాను..'' అంటూ బయటకెళ్ళిపోయాడు అప్పారావు.

రిజష్టర్‌ ఆఫీసులో నీ తరుపున సాక్షిసంతకం చేసిన వాడెవడు డియర్‌ ? గొప్పగా అడిగాడు సందీప్‌
అతను నా మొదటి భర్తలే డార్లింగ్‌ పరవశంగా చెప్పి నాలిక కరుచుకుంది కీర్తి

 '' మీరు దోచుకున్న డబ్బుని పాడుబడ్డ బిల్డింగులో పంచుకుంటుంటే పోలీసులెలా పట్టుకున్నారు?'' అడిగాడొక ఖైది.
'' వాళ్ళప్పుడు అక్కడికి పేకాట ఆడుకోవాటానికి వచ్చారట...'' చెప్పాడు రెండో ఖైది.

 రామారావు తన ఐదేళ్ళ కొడుకుని తీసుకొని సర్కస్‌ చూడ్డానికి వెళ్ళాడు. సర్కస్‌ మధ్యలో ఒక ఫీట్‌ని తన కొడుక్కి చూపిస్తూ '' అలా చూడరా..! ఆ అమ్మాయి సన్నని తీగ మీద ఎంత ధైర్యంగా నడిచి వెళ్తుందో....'' అన్నాడు.
'' ఏమిటి నాన్నా...! అక్కడోక సన్నని తీగ ఉందా? నేనింకా గాల్లో నడుస్తుందేమో
అనుకున్నాను..'' అంటూ పెదవి విరిచాడు కొడుకు

 మీ హోటల్‌కి యింకేప్పుడురాను ! కోపంగా అన్నాడు వంశీ
ఏమైందిసార్‌? అడిగాడు మేనేజర్‌
నాకింకేమి వద్ధన్నాక మీ సర్వరు బిల్లు తెచ్చిచ్చాడు! మరింత కోపంగా అన్నాడు వంశీ

 '' మొన్న నేను నాన్న దగ్గర పడుకుంటాను..'' అన్నాడు కిట్టు.
'' కాదు... మొన్న నేను నాన్న దగ్గర పడుకున్నాను...'' అంది టీచర్‌ వాక్యన్ని సరిచేస్తూ.
'' బహుశా నేను పడుకున్నాక, పడుకొని ఉంటారు..'' అన్నాడు కిట్టు.


 '' అదేమిటి నేను వంట చేస్తున్నది సరిపోలేదా? కొడుకు చేత కూడా వంట చేయించాలా?'' కొడుకు చేత కూరలు తరిగించడం చూసి కమల మీద అరిచాడు శ్రీనివాస్‌.
''బాగుందండీ మీ వరుస. రేపు వాడికి పెళ్ళి కాదా ఏమిటి?'' అంది కమల.


 కిషోర్‌ వెళ్ళి కొట్లో సిగరెట్లు కొన్నాడు. అక్కడున్న ఓ వ్యక్తి అది చూసి '' బాబూ! నువ్వు ఆనందరావుగారి అబ్బాయివి కదూ..?'' అనడిగాడు.
'' ఔనండి..!'' అన్నాడు కిషోర్‌.
'' అరె! ఇంత చిన్నవయసులో ఈ పాడు సిగరెట్లు కాలుస్తున్నావా? తప్పుకదూ..! ఈ విషయం మీ నాన్నకు తెలీస్తే ఎంత బాధపడతాడో తెలుసా..?'' అన్నాడా వ్యక్తి.
'' ఈ సిగరెట్లు నాకోసం కాదండి. మా తమ్ముడి కోసం...'' చెప్పాడు కిషోర్‌.

.అమ్మాయి ఎలా వుందిరా? పెళ్ళిచూపులు చూసొచ్చిన డాక్టర్‌ మిత్రుడిని అడిగాడు అనూప్‌
హెల్దిగానే వుంది చెప్పాడు డాక్టర్‌

'' మీ మావగారు నీకు పండక్కి ఐదు ఉంగరాలు, గోల్డువాచీ పెట్టారట కదా. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళనుకుంటానేం?'' అడిగాడు అజయ్‌.
'' ఔను. నాలుగు రోల్డుగోల్డు షాపులున్నాయి!'' చెప్పాడు విజయ్‌.

 '' ఒరేయ్‌...! నానీ! చిన్నాగాడు ఎందుకురా అలా గుక్కపట్టి ఏడుస్తున్నాడు. వాడు ఏది అడిగితే అది ఇమ్మాన్నాగా...'' బయటనుండి వినిపిస్తున్న ఏడుపు విని వంటింట్లో నుంచి కేక పెట్టింది నాగమణి.
'' వాడు అడిగింది ఇచ్చానమ్మా...! అందుకే ఏడుస్తున్నాడు...'' చెప్పాడు నాని.
'' ఏమిచ్చావు..?''
'' పచ్చి మిరపకాయ..''

నేనొంతో కష్టపడి పైకొచ్చా ఆఫీసరు తన కింద పనిచేసే వర్కర్సుతో అన్నాడు
లిఫ్ట్‌లో రావచ్చుకద్సార్‌! ఠక్కున అన్నడొక వర్కర్‌

 '' మూర్చ ఎప్పుడు వస్తుందిరా?'' అడిగింది సైన్స్‌టీచర్‌.
'' మా నాన్నగారికైతే మా అమ్మ చీరల బిల్లు చూసినప్పుడల్లా వస్తుందండీ!'' చెప్పాడు వంశీ.

అమ్మ ! బిచ్చం తల్లి ! అరిచాడు బిచ్చగాడు
అక్కడ పెట్టి వెళ్ళు నాయనా! అంది కమల

'' మీ తమ్ముడు చూడు ఎప్పుడు నవ్వుతుంటాడు. నీది ఎప్పుడూ ఏడుపు ముఖమే!''
అంది ఇంటికొచ్చి పాఠాలు చేప్పే పంతులమ్మ.
'' దానికా ఆ కుర్రవాడు - వాడికి మీలాంటి వారి పోరు లేదుకదండి మరి'' అన్నాడు ఠక్కున.

 మీ జీవితంతో మరచిపోలేని సంఘటనని చెప్పండి సినినటిని అడిగాడు విలేకరి
కాస్త ఆగండి గుర్తు తెచ్చుకుని చెబుతాను అంది సినినటి

 ఇద్దరు త్రాగుబోతులు రోడ్డుమీద నడుచుకుంటూ పోతున్నారు.
'' నీ పేరేమిటోయ్‌?'' అడిగాడో తాగుబోతు.
'' తెలియదు!''
'' ఓహో ! చాలా మంచి పేరు!''

 నేను గీసిన శవం బొమ్మ ఎలాగుందండి? ఓ సభికుడిని అడిగాడు ఆర్టిస్టు
చాలా బావుందండి కాకపోతే అందులో అసలు జీవకళలేదు అన్నాడు సభికుడు

 '' మీరీమధ్య మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారేమిటండీ?'' అడిగింది కమల.
'' ఆ మధ్య నాకు ఏక్సిడెంట్‌ అయినప్పుడు నీ రక్తమే ఎక్కించారట!'' చెప్పాడు శ్రీనివాస్‌.

1129 .నిన్న రాత్రి నీ ఫస్టునైట్‌ ఎలాజరిగిందే? అడిగింది సుధ
తప్పక పెళ్లిచేసుకుంటాను అంటూ నాలిక కరుచుకున్నారే బాధగా అంది పావని

1130 .  '' మీ నాయనమ్మ చచ్చిపోయిందని ఇది మూడవసారి సెలవు పెట్టటం తెలుసా?'' అన్నాడు ఆఫీసర్‌ కోపంగా.
'' ఏం చేయమంటారు సార్‌? మా నాన్నకు కన్నతల్లి ఒకామె. పెంచుకున్న తల్లి ఒకామె. పెంచుకుందామనుకున్న తల్లి ఒకామె. నాకు మొత్తం ముగ్గురు బామ్మలు!'' చెప్పాడు వంశీ.


1131 . విపరీతమైన కడుపునొప్పి వస్తోందని డాక్టరు దగ్గరకు వెళ్ళాడు బొర్రయ్య.
'' డాక్టర్‌... నాకు కడుపులో విపరీతమైన నొప్పి వస్తోందండి...'' చెప్పాడు.
'' ఎప్పట్నుండి..?'' అడిగాడు డాక్టర్‌.
'' మధ్యాహ్నం మూడు గంటలకు ఒక అరటిపండు తిన్నాను డాక్టర్‌..! అంతే ...!! అప్పట్నుంచి నొప్పి మొదలయింది.''
'' చిత్రంగా ఉందే. అరటి పండు తింటే కడుపునొప్పా? అసలు మీరు ఉదయం నుండి ఏం తిన్నారో చెప్పండి..!'' ఆరా తీస్తూ అడిగాడు డాక్టర్‌.
'' ఉదయం నాలుగు ఇడ్లీతిని, తర్వాత ఎనిమిది పెసరట్లు తిన్నాను. కాసేపటి తర్వాత ఐదు ఐస్‌క్రీంలు తిన్నాను. తర్వాత బేకరీకెళ్ళి తొమ్మిది కేకులు తిన్నాను. తర్వాత భోజనం చేసి పది అరటిపళ్ళు తిన్నాను. తర్వాత నాలుగు జాంగ్రీలు, అరడజను కాజాలు, ఓ పది పూతరేకులు తిని ఓ రెండు జామకాయలు కూడా తిన్నాను డాక్టర్‌. కాని ఇవి ఏమి తిన్నా ఏమి అనిపించలేదు. ఆ తర్వాత ఒక్క అరటిపండు తిన్నాను. అంతే..! నొప్పి ప్రారంభమైపోయింది...'' అంటూ అపసోపాలు పడసాగాడు బొర్రయ్య.

.శ్రీనికాస్‌ వుత్త పిసినారి
ఎలా చెప్పగలవు
నాకు పంపిన నూతన సంవత్సరపు గ్రీటింగుకార్డులో 1999 నుండి 2010 దాక అని ఫ్రింటు చేయించాడు

 సిగరెట్లు తాగడం మానేయాలనిపించింది హరికి. '' ఏం చేయమంటావు?'' అని స్నేహితుడు గిరిని సలహా అడిగాడు.
'' అదా! చాలా తేలిక. నేనిప్పటికి వందసార్లు మానేసాను!'' అన్నాడు గిరి సిగరెట్టు వెలిగిస్తూ.

 '' ఎవడే వాడు?'' అని కూతురు ఎవరితోనో కనబడితే ఇంటికి రాగానే నిలదీశాడు తండ్రి.
'' ఆయన అల్లరి చిల్లరగా, బాధ్యతలేకుండా తిరిగే పోకీరీ కుర్రాడు కాదు నాన్న. పెళ్ళయ్యింది. ఒక పాప కూడా......'' చెప్పింది కూతురు.



 ఏమిటయ్యా నీ ప్రాబ్లం అడిగాడు లాయర్‌
ఒక కేసులో నేను ఓడిపోవడానికి కారణమయిన లాయర్‌ను మర్డరుచేసి మీరా కేసును వాదిస్తారో లేదో కనుక్కోడానికివచ్చా? అన్నాడు

 '' మానవ శరీరంలోఅన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగించే భాగాలు ఏమిటి?'' అడిగింది సైన్స్‌ టీచర్‌.
'' మగవాడి మొదడు, ఆడాదాని నాలుక....'' ఠక్కున చెప్పాడో పిల్లవాడు.

 ఎవరండి ఇంట్లొ
ఎవరో చెప్పుకోండి చూద్ధాం

'' కృష్ణా! నువ్వు ఒక చేత్తో డ్రైవింగ్‌ చెయ్యగలవా?'' కారు నడుపుతున్న కృష్ణను అడిగింది రుక్మిణి.
''ఓ నేను డ్రైవింగ్‌లో చాలా ఎక్స్‌పర్ట్‌ని....'' హుషారుగా చెప్పాడు కృష్ణ.
'' అయితే వెంటనే ఓ చేత్తో నీ ముక్కునుంచి నోట్లోకి కారిపోతున్న చీమిడి తుడుచుకో..'' అంది రుక్మిణి.

 '' మన అమ్మాయికి చూసిన ఆచారిగారి సంబంధం వున్నవాళ్ళేనా?'' అడిగింది కమల.
'' పెళ్ళికొడుకు తరపున లక్షరూపాయలు ఖరీదుచేసి ఇల్లుంది - తాకట్టులో!'' చెప్పాడు శ్రీనివాస్‌.

 నాకు రైల్వేలో ఉద్యోగం వచ్చింది
ఇంటర్వ్యూలో ఏం అడిగారేమిటి
ఏమి అడగలేదు మెల్లగా ఇంటర్వ్యూలన్నీ అయ్యాక వెంటనే నాకా ఉద్యోగం ఇచ్చేశారు

 '' ఏమయ్యా! గుడ్డోణ్ణి అన్నావ్‌..! క్రింద పడ్డ నాణాన్ని ఎలా తీసుకుంటున్నావ్‌?''
'' గుడ్డోణ్ణి కాను మూగ్గోణ్ణి బాబయ్యా..!''

 '' మీరు కొత్త పార్టీ పెట్టడానికి కారణం?'' అడిగాడు విలేఖరి.
'' మారడానికి మరో పార్టీ లేకపోవడమే...'' చెప్పాడు రాజకీయ నాయకుడు.

ఈ ఊళ్ళో పోలీస్‌స్టేషన్‌ ఎక్కడండి అడిగాడు వెంకట్రావు
తిన్నగా వెళ్ళీ కుడిచేతివేపు తిరిగిన తరువాత కెవ్వుమంటూ ఆడవాళ్ల కేకలు వినిపిస్తాయి అక్కడే...చెప్పాడు గోపాలం

 ఆఫీస్‌ లంచ్‌ టైములో భోంచేస్తున్న ఇద్దరు మిత్రుల సంభాషణ
'' నిన్న నాకు తలనొప్పిగా ఉండి మధ్యాహ్నం పర్మిషన్‌ తీసుకొని ఇంటికి వెళ్ళాను కదా..! అక్కడ ఇంటి దగ్గర నేనేం చూశానో తెలుసా..?''
'' ఏం చేశావేమిటి..?''
'' మా ఆవిడ పక్కన ఎవడో పడుకున్నాడు''
'' అయ్యయ్యో..! అప్పుడు నువ్వేం చేశావ్‌..?''
'' చప్పుడు చేయకుండా మెల్లగా వంటింట్లోకి వెళ్ళి స్టౌ వెలిగించి కప్పు కాఫీ కాచుకుని త్రాగాను...''
'' అది సరే.. నీ భార్య పక్కన పడుకున్న వాడి సంగతి ఏం చేశావ్‌..?''
'' ఏడ్చాడు వెదవ... వాడి కాఫీ వాడే కాచుకొని తాగుతాడులే'' అని చప్పుడు చేయకుండా మళ్ళీ బయటికొచ్చేశాను...''


 '' మీ ఇంట్లో పిల్లిని ఎలుక తరుముతున్నదేమిటి?'' ఆశ్చర్యంగా అడిగాడు రమేష్‌.
'' అదేముందిలే. పిల్లిని నేను పెంచుతుంటే ఎలుకని మా ఆవిడ పెంచుతుంది...'' అసలు విషయం చెప్పాడు కుమార్‌.

  '' హలో..! రంగారావు గారేనా..?''
'' ఔనండీ! మీరెవరు..?''
'' నా పేరు గంగరాజు. నేను మీ భార్యను కిడ్నాప్‌ చేశాను. రేపు సాయంత్రానికి మీరు లక్షరూపాయలు తీసుకొని ఊరి చివరికి వస్తే ఆమెను వదిలేస్తాను. లేదంటే చంపేస్తాను''
'' బాబ్బాబూ..! నీకు పుణ్యం ఉంటుంది. నీక్కావలసిన లక్షరూపాయలు తీసుకొచ్చి ఇస్తాను కాని దయచేసి నా భార్యను మాత్రం వదలొద్దు...''

జడ్జి :- మీ ఆవిడని ఎందుకు చంపావ్‌?
ముద్దాయి :- మొదటి భార్య బ్రతికుండగా రెండో పెళ్ళి చేసుకోకూడదని మీ న్యాయ శాస్త్రమే చెబుతుంది కదండీ...

'' బెడ్‌రూంలో వుండగా మా ఆయనెప్పుడూ కొత్తవాళ్ళని చూడలేదు!'' అంది అపర్ణ.
'' నిజమా?'' అడిగింది బిందు.
'' నిజమే. అందరు ఆయనకి తెలిసినవారే!'' చెప్పింది అపర్ణ.

 '' రాజూ...! హిందూ దేవాలయాల్లో పూజారి చేసే ప్రతి పనికి ఒక ప్రత్యేకమైన కారణముంటుంది. గుళ్ళోకి వచ్చిన భక్తులకు బొట్టెందుకు పెడతాడో చెప్పు..'' క్లాసులో విద్యార్థిని అడిగాడు తెలుగు మాస్టారు.
'' ఒకసారి ప్రసాదం తీసుకున్నవాడు మళ్ళీ వస్తే గుర్తుపట్టడానికి సార్‌..!'' చెప్పాడు విద్యార్థి.

 అప్పల్రాజు దొంగతనం చేసినందుకు కోర్టులో హాజరు పరిచారు. వాదన పూర్తి అయ్యాక '' దొంగతనం చేసిన నేరానికి అప్పల్రాజుకు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నాను...'' అన్నారు జడ్జిగారు.
'' సార్‌..! నా దగ్గర ప్రస్తుతం ఎనిమిది వందలున్నాయి. ఒక్కసారి నన్ను బయటకు వదిలితే మిగతా రెండొందలు కూడా తీసుకొచ్చి కట్టెస్తాను..''
కొన్ని క్షణాలు తరువాత '' అంటే ఇంటికెళ్ళి తీసుకువస్తావా..?''
'' అబ్బే... ఇంటికెందుకండీ. ఒక్కసారి కోర్టు చుట్టూ తిరిగొచ్చి కట్టేస్తాను...''

సీత :- మన పెళ్ళికి ముందు మీరు నాకు ఎన్నెన్నో బహుమతులను ప్రజెంట్‌చేసేవారు మరిఇప్పుడెందుకు ఇవ్వడం లేదు ?
శ్రీరాం:- నువ్వెప్పుడైనా చేపలు పట్టేవాడు ఆ చేపల్ని పట్టి బుట్టలో వేసుకున్నాక ఎరలను తినిపించడం చూశావా... ఇదీ అంతేనే పిచ్చి మొహమా.

 '' ఎందుకురా వాసూ..! అంత ఎక్కువగా తాగుతావ్‌..!'' అడిగాడు రవి.
'' ఉల్లిపాయలంటే నాకిష్టం. అవి తిన్నాక వాటి వాసన పోవడం కోసం విస్కీ తాగుతాను. విస్కీ తాగాక దాని కంపుని చంపడానికి మళ్ళీ ఉల్లిపాయలు తింటాను...'' సమాధానం చెప్పాడు వాసు.

 '' డబ్బులొస్తాయని కథలు వ్రాసి ప్రజల మీదకి వదిలా!''
'' మరి డబ్బులు వచ్చాయా?''
'' లేదు. ఆసుపత్రి నుంచి విడుదల కావడానికి బోలెడన్నీ డబ్బులు తగలేయాల్సి వచ్చింది!''

 భార్య :- మీ బాస్‌ని జీతం పెంచమని నిలదీసి అడిగారా లేదా ?
భర్త:- అది మరి మరి ఆయన నా ఉద్యోగం తీసేస్తున్నాను అని అన్నప్పుడు ఆ కంగారులో జీతం అడిగే విషయం మరిచిపోయాను.

 '' ఏమేవ్‌! నీకేమైనా పిచ్చా?'' అరిచాడు ఆనంద్‌.
'' నేనేం చేశానండి?'' అడిగింది భవాని.
'' ఆ స్వామివారి దయవల్ల కొడుకు పుట్టాడని అందరికి చెబుతున్నావెందుకు?'' అడిగాడు ఆనంద్‌.

 భర్త:- రోగంతో మంచం మీద ఉన్న భర్త-ఒద్దు కాంతం నేను ఈ మందు తాగినా బ్రతకను నన్నింక బలవంతం పెట్టొద్దు?
భార్య:- అబ్బ తాగేద్దురు మీరు పోతే రెండొందలు పెట్టికొన్న మందు వేస్టయిపోదూ

 ఆచారి ఎనిమిదవ తరగతి చదువుతోన్న కొడుక్కి ఇంగ్లీష్‌ గ్రామర్‌ చెబుతూ '' ఒరే వంశీ! డైరెక్టు స్పీచ్‌, ఇన్‌డైరెక్టు స్పీచ్‌ గురించి రెండు ఉదాహరణలు చెప్పు?'' అన్నాడు.
'' ఉదయం నామీద కోపం వచ్చి నన్ను తిట్టారు. అది డైరెక్టు స్పీచ్‌, మరెమో నిన్న రాత్రి అమ్మమీద కోపం వచ్చి నన్ను తిట్టారు. అది ఇన్‌డైరెక్టు స్పీచ్‌'' అన్నాడు వంశీ.

 '' హరీ.. శ్రీ కృష్ణదేవరాయలు ఎవరు...?''
'' మా నాన్న సార్‌...!''
'' వాట్‌? మరి భీష్ముడు ఎవరు...?
'' మా తాతయ్య....''
'' కృష్ణుడెవరు..?''
'' మా చిన్నాన్న....''
'' సత్యభామ ఎవరు?''
'' మా అమ్మ సార్‌...''
'' ఓహ్‌...! మరీ తలపోటు సమాధానాలు చెబుతున్నావ్‌. అసలు నువ్వెవరు...?''
'' నాటకాల నరసింహం కొడుకును సార్‌...!''


భార్య:- అరవైఏళ్ళొచ్చాక భార్య సాగదీసుకుంటూ అంది - నేనా జడ్జిగారబ్బాయిని చేసుకున్నా బగుండేది. మీరూ వున్నారు ఎందుకు మా అమ్మ ఇంటి అద్దె ఇస్తుంది మా నాన్నగారు తిండికి డబ్బులిస్తారు. మా అన్నయ్య మన పిల్లల్ని చదిపిస్తాడు, మా పెద్దమామయ్య మనకీ పిల్లలకు బట్టలు కొనుక్కోమని డబ్బులిస్తాడు.
భర్త:- ఊరికే గొప్పలు చెప్పుకోకు నీ కింకా ఇద్దరు మామయ్యలు ముగ్గురు బాబాయిలు వున్నారు వాళ్లెప్పుడైనా దమ్మిడీ విదిల్చారా.

'' అమ్మా...! అమ్మా...! త్వరగా రావే... నాన్న బూటు లేసులదాకా బురదలో కురుకుపోయారు'' కంగారుగా వంటగదిలోకి పరుగెత్తుకు వచ్చి చెప్పాడు బాబిగాడు.
'' అయితే ఏమిటంత కంగారు..? బురదలోంచి నడుచుకొని బయటకి రావచ్చుగా...'' తాపీగా అంది బాబిగాడి తల్లి.
'' అది కాదమ్మా..! నాన్నగారు తలకిందులుగా బురదలో పడ్డారు...''

 '' పుచ్చిపోయిన కూరలు, పగిలిపోయిన పళ్ళ బిజినెస్‌చేసి నాలుగు బిల్డింగ్‌లు ఎలా కట్టావురా?'' అడిగాడు రామారావు.
'' ఆ... ఏముంది. వాటిని సినిమా వాళ్ళకి సప్లయిచేసి సంపాదించాను!'' అన్నాడు నాగేశ్వరరావు.

 భర్త:- ఇది కొత్త బ్లేడా గడ్డం తెగడం లేదేం?
భార్య :- అయ్యోరాత రోజూ పాల ప్కాకెట్టు దానితోనే కోస్తున్నాను ఇంచక్కగా తెగుతున్నాయండీ.

 '' యోగీ..! పక్కింటి కిషోర్‌ని కొట్టావట నిజమేనా..?''
'' నిజమే నాన్నా! నన్ను తిట్టాడు మరి...''
'' నీకసలు బుద్దుందా..? ఎవరైనా తిడితే అలా కోట్టేయడమేనా...?''
'' ముందొకసారి తిడితే ఊరుకున్నాను. రెండోసారి వెధవ అని తిడితే కొట్టాను.''
'' ముందు ఏమని తిట్టాడు..?''
'' గాడిద కొదకా అని....''

'' పర్సులోంచి డబ్బులెందుకు తీశావురా?''
'' నేను పెరుగుతున్నానుగా మమ్మీ....''

భార్య :- అందమైన అమ్మాయిని చేసుకున్నవాడు ఛవట అని ఈ పత్రికలో వ్రాసారునా ఊహ నిజమేనన్నమాట. మీరు నన్ను పెళ్ళి చేసుకున్న రోజే అనుకున్నానను.

 '' ఇన్‌కంటాక్స్‌ వాళ్ళు సినీయాక్టర్‌ యింటిమీద రెయిడ్‌చేసి ఓ డైరీని సంపాదించారట!''
'' అందులో ఏముందో?''
'' ఇతరుల డైరీ చదవకూడదని ఉందట....''

 ఒళ్ళంతా కట్లుకట్టుకుని ఉన్న మిత్రుణ్ణి చూసి ఆందోళనగా అడిగాడు కుమార్‌.
'' ఏమిట్రా..! ఒళ్ళంతా ఈ కట్లు? ఏమైందీ?
'' ఏముందీ..! ఇవి మాయరోజులు. పరోపకారం చేయబోయాను. అంతే పట్టుకొని చితక బాదారు...''
'' పరోపకారం చేస్తే కొట్టారా..! ఏం చేశావ్‌?''
'' నిన్న కాలేజి నుండి ఇంటికి వెళ్ళేటపుడు రోడ్డుమీద నడుస్తున్న ఒకమ్మాయి పైట జారిపోయింది. గబుక్కున నేను వెళ్ళి సర్దాను. అందుకే ఈ శాస్తి.''''


సుబ్బారావు:- అదేమిట్రా చేతికి ఆ కట్టు ఏమిటీ ఎవరు కొట్టారు ?
అప్పారావు:- ఆ ఏంలేదు గురూ నిన్న రాత్రి మా ఆవిడ చూస్తున్నా వద్దంటే తన్నులు సీరియల్‌ ఛానల్‌ మార్చాను అంతే మా ఇద్దరికీ చిన్న గొడవైంది.

'' సార్‌..! సార్‌..! నాకు ఒక్క వారం రోజులు సెలవు కావాలి సార్‌..!''
'' ఎందుకు..?''
'' షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకొని రావడానికి సార్‌..!''
'' భలే వాడివోయ్‌..! మెన్ననే కదా.. షిర్డీ వెళ్ళోచ్చావ్‌..! మళ్ళీ ఎందుకు..?
'' దారిలో ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా, క్షేమంగా ఇంటికి చేరుకుంటే మళ్ళీ దర్శనానికి వస్తానని మొక్కుకున్నాను సార్‌...!''


కారుకి ఏక్సిడెంట్‌ జరిగిందని ఇన్యూరెన్స్‌ కంపెనీకి ఫిర్యాదు చేయడానికి వచ్చాడు వంశీ. '' డబ్బు ఇవ్వం కాని, కారుని రీప్లేస్‌ చేస్తాం'' అన్నాడు ఇన్యూరెన్స్‌ ఆఫీసర్‌.
'' అలాగయితే నా భార్యమీదున్న పాలసీని వెంటనే కేన్సిల్‌ చేసుకుంటున్నాను'' అన్నాడు వంశీ.

యమ్‌.యస్‌.నారయణ భారత ప్రధానిగా వేషం వేసి ఆయన గొంతుతో మాట్లాడుతాడు. మెగాస్టార్‌ వేషం వేసి అచ్చు అదే గొంతుతో మాట్లాడుతాడు.ఒక్కోసారి గ్రామపంచాయితి ప్రెసిడెంట్‌లాగా... ఇలా పెద్ద పెద్దవాళ్ళ వేషాలు వేసి వాళ్ళు గొంతులను అనుకరించేవాడు. ఇంతకీ అతడి భార్య తను ఎవర్ని పెళ్ళి చేసుకున్నాను అని అప్పుడప్పుడూ అనుకంటుందట.

'' పెళ్ళికి వచ్చిన వస్తువులన్నిటినీ విప్పి తీక్షణంగా గమనిస్తున్నారేమిటండీ?'' అడిగారు పరంధామయ్య.
'' ఈ మధ్య ఎవరినీ నమ్మటానికి వీలులేకుండా వుంది బాబాయిగారు. ప్రతి వస్తువులోనూ బాంబులు పెడుతున్నారు?'' అంది అపర్ణ.

 ఏమో సరళా ఈ సీరియల్‌లోని హీరోయిన్‌ ఎన్నిసార్లు ఏడ్చిందో చెప్తే బహుమతి ఇస్తారట. టి.వి.లో వస్తున్న సీరియల్‌ని చైపిస్తూ చెప్పాడు భర్త.
వాళ్ళ బొంద సీరియల్‌ ప్రారంభంనుండి హీరోయిన్‌ ఏడుస్తూనే వుందండి చెప్పింది భార్య

 '' మా నాయకుడి నెత్తిమీదకి త్వరలో కత్తి రాబోతున్నది!''
'' అంటే కోర్టేమైనా సమన్లు జారీ చేయబోతున్నదా?''
'' అదేం కాదు. త్వరలో తిరుపతి వెళ్ళి బోడిగుండు కొట్టించుకోబోతున్నాడు.''

 '' ఇంతకు ముందు రంభ, ఊర్వశి, మేనక అని పొగిడేవారు. ఇప్పుడు ఒక్కసారైనా అలా పిలవడం లేదేం?'' అడిగింది భార్య.
'' జీవితాంతం అబద్దాల్తో బ్రతకడం మంచిది కాదనిపించి మానేశాను...'' చెప్పాడు భర్త.

 ఒరేయ్‌ ఈడియట్‌ ముక్కుకారుతుంది తుడుచుకోవాలన్నా జ్ఞానం లేదా? పదేళ్ళ కొడుకుని గదమాయించాడు తండ్రి
మరి నిన్న ప్రక్కింటి ఆంటీని చూసి నువ్వు చొంగకార్చుకున్నావ్‌. అప్పుడు లేదా నీకు ఈ జ్ఞానం అని తుర్రుమన్నాడు కొడుకు.


 '' ఎప్పుడూమీరు ఇదే ఫేన్‌ని రిపేరింగ్‌కు తెస్తున్నారేమిటి సార్‌?''
'' మా ఆవిడ ప్రతిసారి చచ్చిపోతానని ఫేన్‌కి ఉరిపోసుకుంటోంది. దాని బరువుకి ఫేన్‌ విరిగిపోతుందే తప్ప అది చావడం లేదు...''

 '' పెళ్ళయిన ముప్పయి సంవత్సరాల తరువాత నేనో పొరపాటు చేసానని తెలుసుకున్నాను. అది నిన్ను పెళ్ళి చేసుకోవడమే'' అన్నారు పరంధామయ్య.
''నేనొక దద్దమ్మని పెళ్ళిచేసుకున్నానని పెళ్ళినాడే గ్రహించాను. నాకిన్నాళ్ళు పట్టలేదు'' అంది అన్నపూర్ణ.


 '' హల్లో! ఇన్‌స్పెక్టర్‌గారేనా..? మీరు అర్జంటుగా రావాలి. ట్రాఫిక్‌లో పెద్ద ఏక్సిడెంట్‌ అయింది సార్‌..!''
'' అక్కడ బీట్‌ కానిస్టేబుల్‌కి చెప్పొచ్చు కదయ్యా...!
'' ఏక్సిడెంట్‌ జరిగింది ఆయనకేనండీ...''

 సెకండ్‌షోకి వెళ్తున్నారు భార్యాభర్తలు
భర్త:- తాళం సరిగ్గా వేశావా లేదా? దారి మధ్యలో అడిగాడు
భార్య:- తాళం బాగానే వేశానండీ... కాని గొళ్ళెం పెట్టడం మర్చిపోయాననుకుంటా... తాపీగా చెప్పింది.

 '' ఒక బద్దకస్తుడి ఇంట్లో ఒకరోజు రాత్రి దొంగలుపడి దోచుకునిపోతుండగా ఆ బద్దకస్తుడికి మెలుకువ వచ్చింది. ఆ దొంగలను చూసిన బద్దకస్తుడు పూర్తిగా నిద్రలేవకుండానే '' పట్టుకుపోయేవాళ్ళు ఎలానూ పట్టుకుపోతున్నారు. ఆ సొమ్ముల లిస్టు వ్రాసి పోలీసు స్టేషన్‌లో కంప్లయింట్‌ యిచ్చిపోండి'' అని మళ్ళా నిద్రలోకి జారుకున్నాడు.

 '' హలో..! టూటౌన్‌ పోలీస్‌ స్టేషనా..?''
'' ఔను... ఎవరు మాట్లాడేది..?''
'' నేను సార్‌... 402 కానిస్టేబుల్‌ని. ఇక్కడ వినాయక సెంటర్‌లో కారు ఏక్సిడెంట్‌ అయ్యి ఒక వ్యక్తి చనిపోయాడు. మీరు అర్జంటుగా రావాలి...''
'' అది మన స్టేషన్‌లోకి రాదయ్యా..! త్రీ టౌన్‌ వాళ్ళది. వాళ్ళకు ఫోన్‌ చేసి అప్ప చెప్పేయ్‌..''
'' అయితే .. అతని మెడలో బంగారు గొలుసు, చేతి ఉంగరాలు, డబ్బున్న సూట్‌కేస్‌ అన్ని అప్ప చెప్పేయమంటారా..?''
ఇవన్నీ ఉన్నాయా..? అరె..భలేవాడివే.. నేనేదో పరధ్యానంలో అన్నాను. అది మన స్టేషన్‌లోకే వస్తుంది. నేనిప్పుడే వస్తున్నాను. అక్కడే ఉండు...''

 విలేఖరి:- ప్రతి పురుషుని వెనుక ఓ స్త్రీ వుంటుందంటారు కదా మరి మీకీరోజు అతిపెద్ద హోటల్లో ఛీఫ్‌ కుక్‌గా ఎదగటానికి ఎవరున్నారు?
భర్త:- ఇంకెవరూ నా భార్యే.
విలేఖరి:- అలాగా ఆమె పలా ప్రోత్సహించారు?
భర్త:- ఏముంది ఇంట్లో రోజూ వంట చేయమని పీడించుకుని తినేది.

 '' పెళ్ళికి మీ ఆవిడని మరీ మరీ తీసుకురమ్మని చెబితే మీరొక్కరే వచ్చారేమిటండీ?'' అడిగాడు ఆచారి.
'' అదేముందిలెండి. ఆవిడ వారం క్రితమే కొత్త చెప్పులు కొనుక్కుంది'' అన్నాడు శ్రీనివాస్‌.

ఒక పల్లెటూరి పుల్లయ్య పట్నం వచ్చాడు. పట్నంలో అతనికి ఏదైనా కొనాలనిపించి ఒక షాపుకి వెళ్ళాడు. షాపతన్ని '' సార్‌! ఆ టి.వి. ఎంత..?'' అనడిగాడు.
షాపతను ఓసారి పుల్లయ్యని ఎగాదిగా చూసి '' అది అమ్మడానికి కాదు...'' అన్నాడు.
కాని పుల్లయ్యకి మాత్రం అది కొనాలనిపించింది. వెంటనే బయటకెళ్ళి కాసేపటి తర్వాత ఒక సిక్కువాడి వేషం వేసుకొచ్చి '' సార్‌! నాకు ఆ టి.వి. కావాలి..?'' అన్నాడు.
' భలేవాడివే.. ఇంతకు ముందొకసారి చెప్పాను కదా..! అది అమ్మడానికి కాదు..'' అన్నాడు షాపతను. వేషం మార్చినా తనను ఎలా గుర్తుపట్టాడో అర్థంకాలేదు పుల్లయ్యకి. అయినా ఆశ చావక కాసేపటి తర్వాత బుడబుక్కల వాడివేషం వేసుకువచ్చి '' అయ్యా! ఆ టి.వి. ఎంతకు అమ్ముతారేమిటి.?'' అన్నాడు.
'' మళ్ళీ వేషం మార్చుకువచ్చావన్నమాట.. అది మాత్రం నీకు అమ్మనయ్యా..'' అన్నాడు షాపువాడు. అలా మరో రెండు వేషాలు మార్చాడు పుల్లయ్య. షాపువాడు గుర్తుపడుతూనే ఉన్నాడు. ఆఖరున పుల్లయ్య షాపు అతనితో '' అయ్యా! నేనిప్పటికి ఐదు వేషాలు మార్చాను. ప్రతిసారీ మీరు గుర్తుపట్టేస్తున్నారు. మీరు నాకా టి.వి. అమ్మకపోయినా పర్వాలేదు. నన్నెలా గుర్తు పట్టారో మాత్రం చెప్పండి...'' అన్నాడు.
షాపతను నవ్వుతూ '' చూడు.. ఈ లోకంలో దాన్నెవడూ కూడా టి.వి. అనడు. అది మా షాపులో అవసరాన్ని బట్టి పెట్టిన రిఫ్రిజరేటరు'' అంటూ అసలు విషయం చెప్పాడు.

 భర్త:- ఈ రోజు సిన్మాకి వెళ్దాం రెడీగా వుండు
భార్య:- రేపు వెళ్దాంలెండి.
భర్త:- ఏం ఎందుకు
భార్య:- రేపు శనివారం టీవిలో సీరియల్స్‌ రావు కనుక వాటిని మిస్సయ్యే బాధ వుండదు.

 ఒక వ్యక్తి నడిరోడ్డు మీద పడుకొని తన కుడిచెవిని రోడ్డుకు ఆనించి ఏదో వింటున్నట్లు కనిపించాడు బీమారావుకి. వెంటనే అతని వద్దకు వెళ్ళి
'' సార్‌..! మీరు చెవి రోడ్డుకు ఆనించి ఏం చేస్తున్నారు సార్‌?'' అనడిగాడు.
'' ఎ.పి. - 31, టి- 1071 లారీ గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకుపోతోంది..'' చెప్పాడతను.

 అరె..! ఆ విషయం మీరు అంత కరెక్టుగా ఎలా చెప్పగల్గుతున్నారు..?'' ఆశ్చర్యంగా అడిగాడు భీమారావు.
'' ఐదు నిమిషాల క్రితం నేను ఆ లారీలోంచే కిందపడ్డానయ్యా బాబూ..!'' మూల్గుతూ చెప్పాడా వ్యక్తి.


 '' ట్రాఫిక్‌ రూల్స్‌ని పాటిస్తూ మెల్లిగా వెళ్ళే డ్రయివర్‌ కావాలన్నారుగా. ఇతను నీకు సరిగ్గా సరిపోతుడు'' వంశీని పరిచయం చేసాడు రమేష్‌.
'' ఇంతకుముందు నువ్వేం చేసేవాడివోయ్‌?'' అన్నాడు కుమార్‌.
'' రోడ్‌ రోలర్‌ని నడిపేవాడినండి'' వినయంగా బదులు యిచ్చాడు వంశీ.

 గిరి:- ఏరా నువ్వు అనాధ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావట కదా నీదెంత గొప్పమనసురా. నీవునా స్నేహితుడివి కావడం నాకు చాలా గర్వంగా వుంది.
హరి:- అంత సీన్‌ లేదు. అనాధ అయితే మాటి మాటికి పుట్టింటికి పోయే గొడవ వుండదని చేసుకున్నాను.

 '' ఏమిటి రాజుగారు విచారంగా కూర్చున్నారు?''
'' ఆయన ఆస్థానంలోని స్త్రీలందరికి ఎయిడ్స్‌ వుందని అస్థాన వైద్యుడు చెప్పాడట!''

 సమ్మక్కా, సారక్కా నల్లా దగ్గర నీళ్ళు పట్టుకుంటూ మాట్లాడుకుంటున్నారు.
'' వదినా..! నీ కొడుకు కాపురం ఎట్లుందీ..?''
'' ఏం సెప్పమంటావు వదినీ..! నా కోడలు ఒక రాక్షసి. నా కొడుకు అమాయకుణ్ణి చేసి
కొంగుకి ముడేసుకుని తిప్పుకుంటోంది. ఏం మందు పెట్టిందో, ఏం మాయ చేసిందో గాని ఆడు పెండ్లాం మాటకు ఎదురుసెప్పడు. ఏం సేయమంటే అది కిక్కురుమనకుండా సేస్తడు.''
'' అట్లనా వదినీ..! మరి కూతురు కాపురం ఎట్టున్నదే...?''
'' ఏమాటకామాట సెప్పాలే అమ్మా..! నా అల్లుడు ఎంతమంచోడనుకుంటున్నావ్‌. అస్సలు నా కూతురు మాటకు ఎదురుసెప్పడు. నా కూతురు ఏం జెప్పినా మంచిగా సేస్తడు. అట్లాంటి అల్లుడు ఎక్కడోగాని కన్పించడంటే నమ్ము..''

భర్త:- ఈ పిచ్చి కుక్కని మచ్చిక చేసుకోవడం నీ వల్లకాని పని.
భార్య:- ఏం మన పెళ్ళయిన తర్వాత నేను మిమ్మల్ని మచ్చిక చేసుకోలేదా?

 '' ఏం చేస్తున్నావోయ్‌?''
'' పళ్ళ వ్యాపారం''
'' డెంటిస్ట్‌నని సరిగ్గా చెప్పవచ్చు కదా?''

.నాలుగేళ్ళ రాము- చెలియా చెలియా చిరుకోపమా అని పదేపదే ఆ పల్లవినే పాడుతున్నాడు.వాళ్ళమ్మకి విసుగొచ్చి నోర్ముయ్యరా వేలిడంతలేవు ఏమిటా పాటలు? అని కసిరింది. మరి ఇందాక నాన్న పనిమనిషి రత్తాలు దగ్గర ఈ పాటేపాడాడు రత్తాలు నవ్వింది మరి ఉక్రోషంగా అసలు విషయం చెప్పాడు రాము.

 '' పొద్దుననుంచి నదిలో ఈత కొడుతున్నారు. ఏదయినా గిన్నెస్‌ బుక్‌లోకి యెక్కడానికి ట్రై చేస్తున్నారా?'' అడిగాడు రమేష్‌.
'' అదేం కాదండిబాబూ! పొద్దున్నే నా బట్టలెవరో ఎత్తుకుపోయారు'' మొత్తుకున్నాడు కుమార్‌.

 సీతీపతి వెళ్ళి పోస్ట్‌మెన్‌ ఇచ్చిన కవరుని అందుకున్నాడు. ఢమాల్‌ పత్రికలో నేను వ్రాసిన వంటకాలను రెమ్యునేషన్‌ వచ్చిందా అని వటింట్లోనుండి అరిచింది సుభద్ర.
కాదే పాఠకులు నువ్వు వ్రాసిన కోడిగుడ్డు పాయసం చదివి చేసుకుని తిని ఆసుపత్రి పాలయ్యారట. వాళ్ళందరూ కోర్టులో దావా వేసారు. ఆ కాగితాలు ఇవి సంతోషంగా చెప్పాడు భర్త.

 '' ఎంత పేలుస్తున్నా ఒక్కటి పేలట్లేదు''
'' ఏం పేలుస్తున్నావేమిటి?''
'' జోకులు''

 '' ఇందాక నీకు అతి ముఖ్యమైన ఉత్తరాన్ని ఇచ్చానే.. దాన్ని పోస్టు చేశావా?'' యజమాని నౌకర్ని ప్రశ్నించాడు.
'' చేసేశాను సార్‌..! ఇవిగోండి..'' అంటూ డబ్బులిచ్చాడు నౌకర్‌.
'' అదేమిటోయ్‌..! ఈ డబ్బులు స్టాంపులు కొని కవరుకు అతికించడానికి ఇచ్చాను కదా! తిరిగి తెచ్చాశావేమిటి..?'' ఆశ్చర్యంగా అడిగాడు యజమాని.
'' స్టాంపులు కొనే అవసరం కలగలేదండి. ఎవరూ చూడకుండా ఉత్తరాన్ని డబ్బాలో వేసేశాను.'' తన తెలివికి తనే మురిసిపోతు చెప్పాడు నౌకరు.

.నూతన రచయిత కలహాల రావు చాలా డల్‌గా నడచి వెళ్ళిపోతున్నాడు. అది చూసి అతడి మిత్రుడు ఉండబట్టలేక అడిగాడు.
మిత్రుడు:- అదేమిటోయ్‌ అంత విచారంగా వున్నావ్‌?
రచయిత:- మొన్న పత్రికకు నవల వ్రాసి పంపించాను తిరిగి వచ్చేసింది.
మిత్రుడు:- అయ్యోపాపం
రచయిత:- పూర్తి పల్లెటూరి వాతావరణంలో అద్భుతంగా వ్రాసాను.ఈ మోడ్రన్‌ పత్రికలు అదెక్కడ గుర్తిస్తాయి.
మిత్రుడు:- అవును నిజమే.
రచయిత:- ఆ కథ విని నా భార్య ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. అంత అమోఘంగా వ్రాసాను.
మిత్రుడు:- అలాగా జీవితంలో ఒక్కసారైనా నా భార్యని ఏడిపించాలనివుంది.ప్లీజ్‌ ఆ నవలని నాకొక్కసారి ఇవ్వవూ.

 '' ఎంత చెప్పినా మీరు సిగరెట్లు త్రాగడం మానడంలేదు. నాకంటే అవే ఇష్టమా..?''
'' ఛ.. నాకు సిగరెట్టంటే పరమ అసహ్యం. అందుకే వాటిని కాల్చి కాల్చి బూడద చేసి అవతల పారేస్తాను..''

'' ఏరా దొంగవెధవా! నా ఇంటికే కన్నం వేస్తావా?'' కోపగించుకున్నాడు ఇన్‌స్పెక్టర్‌.'' క్షమించండి సార్‌.... ఈ రోజు సాయంత్రమే జైలునుండి వచ్చిన నాకు మీరు ఇల్లుమారిన సంగతి తెలియక కన్నంవేసాను.''

 ఓ చోట బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ జరుగుతోంది. మేస్త్రీ కూలీల పనిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాడు. హఠాత్తుగా ఆ మేస్త్రీ గోతిలోంచి పారతో మట్టితీసి బయటకు వేస్తున్న ఓ కూలీ దగ్గర ఆగిపోయాడు. '' నువ్వొకసారి గోతిలోంచి బయటకు రా...'' అన్నాడు కూలీతో. కూలీ బయటకు వచ్చాడు. అలా ఆ కూలీ చేత గోతిలోకి, బయటకి అయిదుసార్లు దూకించాడు మేస్త్రి.
'' ఏంది సార్‌..! నాతో ఆటలాడ్తఉండారు...'' ఆరోసారి అడిగాడు విసుగెత్తిన కూలీ.
'' ఏం లేదు నువ్వు పారతో వేసే మట్టికంటే నీ కాళ్ళకి అంటుకొని బయటకు వస్తున్న మట్టే ఎక్కువగా ఉంది. అందుకనీ..'' మెల్లగా చెప్పాడు మేస్త్రీ.

 డాక్టర్‌ డాక్టర్‌ మా వారికి హార్ట్‌ఎటాక్‌ వచ్చింది.ప్లీజ్‌ తొందరగారండి చెప్పింది కాంతం.
సరే పదండి అని ఎలా వచ్చిందమ్మా? నడుస్తూ అడిగాడు డాక్టర్‌
ఈయనికి అప్పు ఇచ్చినాయన సడన్‌గా పోయాడట ఆ సంతోషం తట్టుకోలేక ఈయనికి ఇలా ఏడుస్తూ నోట్లో కొంగుకుక్కుకుని చెప్పింది కాంతం.

 '' నువ్వు పెద్ద మోసగాడివి. ఎన్నోసార్లు కోర్టుకు వచ్చి అబద్దాలు చెప్పావు. ఇకపైన నువ్వు ఏం చెప్పినా దాన్ని వ్యతిరేకంగా నమ్ముతాను... '' అన్నాడు జడ్జి.
'' మహాప్రభో..! నేను పచ్చిమోసగాడిని, నేను చెప్పేవన్నీ అబద్దాలు. నేను మీరు విదించే శిక్షకు అర్హుడిని..'' అన్నాడు తెలివిగా దొంగ.

 '' ఎలాగయినా మా నాన్నగారిని బతికించండి డాక్టర్‌'' వేడుకున్నాడు వంశీ.
'' అలాగేనయ్యా, ఆపరేషన్‌ కూడా చేయనంటున్నానుగా'' ఇంకా డౌటెందుకు?'' అన్నాడు డాక్టర్‌.

 చంద్రం:- పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయట?
సూర్యం:- ఇంతకీ నీకు పెళ్లయిందా?
చంద్రం:- లేదు ఏం?
సూర్యం:-అయివుంటే తెలిసేది స్వర్గంలోనో నరకంలోనో! విషాదంగా చెప్పాడు.

 ఫోన్‌ గురించి ఏమీ తెలియని బంగారమ్మ ఇంటికి కొత్తగా ఫోనొచ్చింది. కొడుకును కోపంగా '' ఏరా! ఫోన్‌ ఎత్తకుండా అలా చూస్తున్నావ్‌..?'' అంది.
'' అది ఇంకా మ్రోగలేదు కదమ్మా..!'' అన్నాడు కొడుకు.
'' ఛ నువ్వు ఆఖరి క్షణం వరకూ ఏమీ చెయ్యవు. మ్రోగే వరకూ ఆగాలా..!'' విసుక్కుంది బంగారమ్మ.

 '' దేవుడు ప్రత్యక్షమయితే ఏ వరం కోరుకుందామండి?'' అంది కమల.
'' ఆకలి లేకుండా వరమివ్వమందాం!'' అన్నాడు శ్రీనివాస్‌.
'' చాల్లెండి వెధవ కోరిక. ఈ వంటసామానంతా ఏం చేసుకోవాలి?'' మొగుడి నెత్తిమీద ఠక్కున మొట్టి, రుసరుసలాడుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది కమల.


 '' రాధాబాయిగారు...! ఎదురింట్లో అద్దెకు ఆమాదేవి దిగింది చూశారు..! ఆవిడ నిజంగా మగాడై పుట్టాల్సింది. ఎక్కడో ఏదో తప్పు జరిగి పొరబాటున ఆడదానిలా పుట్టిందంటే నమ్మండి..''
'' ఎందుకండీ! అలా అంటున్నారు..''
'' ఔనండీ! నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను. అచ్చం మగాళ్లు చేసినట్లు చాలా అద్భుతంగా ఉంది మరి..''

 '' డాడీ..డాడీ..! మా స్కూల్లో నాటకాలు వేయిస్తున్నారు. నాక్కూడా ఓ పాత్ర యిచ్చారు. '' అన్నాడు. అప్పుడే స్కూల్‌ నుండి వచ్చిన కొడుకు.
'' అలాగా..! ఇంతకూ నీకేం పాత్ర ఇచ్చారు...?'' అడిగాడు తండ్రి.
'' తండ్రిపాత్ర డాడీ..!
' తండ్రిపాత్రా..? కాస్త డైలాగులుండే పాత్ర అడగలేకపోయావా..?'' నీరసంగా అన్నాడు తండ్రి.

 పిచ్చి చేష్టలు చేస్తున్న గుర్నాధాన్ని డాక్టర్‌ పరీక్షించి డాక్టర్‌ భార్యని అడిగాడు
మీ ఆయన ఎప్పటి నుండి ఇలా నాడబ్బు నా డబ్బు అని కలవరిస్తున్నాడు
రెండు రోజుల క్రితం ఈయన దగ్గర అప్పు తీసుకున్నాయన కోమాలోకి వెళ్ళిపోయాడని తెలిసినప్పటి నుండి అంటూ అసలు విషయం చెప్పింది భార్య.

 '' ఈ వేళ ఏందుకింత ఆలస్యమైంది..?'' చాలా కోపంగా అడిగాడు మేనేజరు.
'' అదీ...అదీ... ఇంటిదగ్గర వంటకు ఉల్లిపాయలు కోస్తుంటే వేలు తెగింది సార్‌..!''
నసుగుతూ చెప్పాడు గోవిందం.
'' ఛ... అలా చెప్పడానికి సిగ్గులేదూ..?''
'' నిజం సార్‌..!''
'' చాల్లేవయ్యా.. చెప్పావు... నేను ఇరవై సంవత్సరాల నుండి వంటచేస్తున్నాను. కాని ఇంతవరకూ చిన్న గాటైనా పెట్టుకోలేదు తెలుసా...?'' అన్నాడు మేనేజరు.

 '' ఏవండీ! అర్జెంటుగా మనం ఈ ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపోవాలి. పక్కింటి కాంతమ్మగారితో వేగలేకపోతున్నాను...'' అంది భార్య భర్తతో
'' ఏమైందిప్పుడు..?'' అడిగాడు భర్త.
'' వారం రోజుల క్రిందట వందరూపాయలు అవసరమని తీసుకెళ్ళి ఇంతవరకూ తిరిగివ్వలేదు...''
'' పోనీలేవే. డబ్బులకు ఇబ్బందిగా ఉండి తీసుకువెళ్ళుంటుంది. ఇచ్చేస్తుందిలే...''
'' మొన్న గ్లాసుడు పంచదార, సోలెడు కందిపప్పు, కేజీ బియ్యం కూడా తీసుకెళ్ళింది..''
'' సరుకులు అయిపోయింటాయి. తెచ్చుకున్నాక ఇచ్చేస్తుందిలే..''
'' అంతటితో ఆగితే పర్వాలేదండీ. రాత్రి మా కోడలు ఊరెళ్ళింది. మా అబ్బాయి గొడవచేస్తున్నాడు. ఆ రెండ్రోజులు మా అబ్బాయి దగ్గరకు మీ కోడల్ని పంపించండి..'' అంది.

 మురళీ, స్రవంతుల మధ్య తగాదావచ్చి పోట్లాడుకున్నారు. స్రవంతి కోపంగా అంది.
'' ఛీ! ఇకనుంచి నాతో మాట్లాడకు. నీ ముఖం నాకు చూపించకు, పో!''
'' అయితే ఇంతకాలం నేనిచ్చిన ప్రజంటేషన్‌లు, లవ్‌లెటర్లు వాపస్‌ చేయాలి'' అన్నాడు మురళి.
'' అలాగే'' అంది స్రవంతి అదేమంత పెద్ద విషయం కానట్లు.
'' అంతేకాదు. ఇంతకాలం నేను పెట్టిన ముద్దులుకూడా రిటర్న్‌ చేయాలి'' హెచ్చరించాడు మురళి.


. ''ఏమిట్రా రాజేష్‌..! ఉన్నట్టుండి కారుస్పేరు పార్టుల బిజినెస్‌ పెట్టావు..?''
'' ఏముందీ..! మొన్న మాంచి స్పీడుగా వెళ్తూ నా కారు చెట్టుకి గుద్దేసింది. కారు రిపేరింగ్‌ చేయడానికి కూడా పనిచేయకపోవడంతో పార్టులన్నీ విప్పేసి ఇలా అమ్ముతున్నాను..''

 తెల్లవారుజామున వచ్చే కలలు నిజమౌతాయట నిజమేనా? భయంగా అడిగాడు పాపారావ్‌
ఓ తప్పనిసరిగా జరిగి తీరుతాయి ఇంతకీ నీకెందుకొచ్చింది ఈ అనుమానం అన్నాడు మిత్రుడు
మరేంలేదు ఈ రోజు తెల్లవారుజామున నాభార్య కరాటే నేర్చుకున్నట్లు కలవచ్చింది-దీనంగా అన్నాడు పాపారావు.

 '' సభని ఎందుకు నిర్వహిస్తున్నారు?'' అడిగాడు హరి.
'' మొన్న మాజీ మంత్రిగారి ఇంట్లో ఇన్‌కంటాక్స్‌ వాళ్ళుపడి వున్నదంతా తీసుకుపోయారు. ఇప్పుడాయనకి సహాయంగా బస్తాడు బియ్యం, రెండు కిలోల పప్పు, కిలో ఉప్పు తదితరులు యివ్వడానికట'' అన్నాడు గిరి.


 '' అమ్మా.... అన్నయ్య వాళ్లకు ఈ వేళ ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌ ఇచ్చారు.లెక్కల్లో అన్నయ్యకు ఒకే ఒక మార్కు వేశారు. అన్నయ్య దానిపక్కన సున్నవేసి పది చేశాడు.'' తల్లికి కంప్లైంట్‌ చేశాడు వాసు.
'' అలాగా.. అది చాలా తప్పడుపని. వాడి సంగతి నేను చూస్తాను కాని అదే స్థానంలో నీకు కనుక ఉంటే ఏం చేసేవాడివి'' అడిగింది తల్లి.
'' నేనైతే ఒకటికి ముందు తొమ్మిది వేసి ఉండేవాడిని..'' చెప్పాడు వాసు.

1220 .వదినా మీ శిరీషను చూడటానికి పెళ్ళివారు వచ్చి వెళ్ళారటకదా కాయా పండ?ఆరాతీసింది పొరిగింటి కాంతమ్మ.
పుచ్చు...ఎప్పుడు ఇలా చచ్చుప్రశ్నలు అడక్కు అంటూ ధడేలున తలుపేసుకుంది ఆండాళ్ళు

1 comment:

  1. నాకు సహాయం చేసే చీఫ్ ఎలి డోడోరు చేసిన మంచి పని గురించి ఇది నా సాక్ష్యం .... నేను ఉత్తర కరోలినా USA నుండి ఆన్ ఎర్నిస్. ఈ స్పెల్ క్యాస్టర్ సహాయంతో, గత 3 సంవత్సరాలుగా నన్ను విడిచిపెట్టిన నా భర్త తిరిగి వచ్చాడు, చివరికి నేను ఈ వ్యక్తిని ఒక బ్లాగ్ సైట్‌లో కలుసుకున్నాను, ఒకరు సహాయం కోసం క్లయింట్, నేను అతనికి ప్రతిదీ వివరించాను మరియు అతను నాకు ఒక గురించి చెప్పాడు తనకు తెలిసిన స్పెల్ క్యాస్టర్ మరియు నా సమస్యలను అతనికి చెప్పడానికి స్పెల్ క్యాస్టర్‌కు రాయడానికి అతను తన వాట్సాప్ ఇచ్చాడు. కేవలం 2 వారాల్లో, నా భర్త నా దగ్గరకు తిరిగి వచ్చాడు. ఈ నిజాయితీగల మరియు హృదయపూర్వక స్పెల్ క్యాస్టర్‌కు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను, సార్ మీరు నాకు చెప్పినవన్నీ పాస్ అయ్యాయి మరియు ధన్యవాదాలు సార్. దయచేసి నేను వారి సమస్యకు ఏదైనా పరిష్కారం కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికీ చెప్పాలనుకుంటున్నాను, ఈ స్పెల్ క్యాస్టర్‌ను దయతో సంప్రదించమని, అతను నిజమైనవాడు, అతను శక్తివంతమైనవాడు మరియు స్పెల్ క్యాస్టర్ ఏది చెప్పినా ఏమి జరుగుతుందో చెప్పండి, ఎందుకంటే స్పెల్ క్యాస్టర్ నాకు చెప్పినదంతా వచ్చింది పాస్ చేయడానికి. మీరు దయచేసి అతనిని సంప్రదించవచ్చు: whatsapp +2349015088017

    ReplyDelete